News


వరుసగా నాల్గవ నెలా ఎగుమతులు ‘మైనస్‌’

Saturday 14th December 2019
news_main1576295466.png-30220

  • నవంబర్‌లో వృద్ధిలేకపోగా 0.34 శాతం క్షీణత
  • విలువ రూపంలో 25.98 బిలియన్‌ డాలర్లు
  • దిగుమతులూ క్షీణతలోనే...
  • విలువ 38.11 బిలియన్‌ డాలర్లు
  • వెరసి వాణిజ్యలోటు 12 బిలియన్‌ డాలర్లు


న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు వరుసగా నాల్గవ నెలా నిరాశనే మిగిల్చాయి. అసలు వృద్ధిలేకపోగా -34 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో ఎగుమతుల విలువ 25.98 బలియన్‌ డాలర్లు. ఇక దిగుమతులూ క్షీణ బాటలో ఉన్నాయి. -12.71 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి దిగుమతులు విలువ 38.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు-దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 12.12 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2018 నవంబర్‌లో వాణిజ్యలోటు 17.58 బిలియన్‌ డాలర్లు.   కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...

- పెట్రోలియం (-13.12 శాతం), రత్నాలు- ఆభరణాలు(-8.14 శాతం), పండ్లు-కూరగాయలు (-15.10 శాతం), తోలు ఉత్పత్తులు (-5.29 శాతం), రెడీమేడ్‌ దుస్తుల (-6.52 శాతం) ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాలేదు.  ఎగుమతులకు సంబంధించి దాదాపు 30 కీలక రంగాల్లో 17 క్షీణతను నమోదుచేసుకున్నాయి. 
- పసిడి దిగుమతులు 6.59 శాతం పెరిగి 2.94 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 
- చమురు దిగుమతులు - 18.17 శాతం పడిపోయి 11.06 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతుల విలువ 10.26 శాతం తగ్గి 27.04 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 

ఎనిమిది నెలల్లోనూ క్షీణత...
కాగా, ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ చూస్తే, ఎగుమతులు 1.99 శాతం పడిపోయి 211.93 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 8.91 శాతం పడిపోయి 318.78 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 

ఇబ్బందిగానే ఉంది...
2019 నవంబర్‌లో ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో వృద్ధి 6.32 శాతంగా ఉంది. అయితే మొత్తంగా చూస్తే, విదేశీ వాణిజ్య పరిస్థితులు సవాళ్లమయంగా కనిపిస్తోంది. ప్రపంచమార్కెట్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. 
- రవి సింఘాల్‌, ఈఈపీసీ ఇండియా చైర్మన్‌


ఆర్థిక వ్యవస్థలో బలహీనత
గణాంకాలు చూస్తుంటే, ఆర్థిక వ్యవస్థలో బలహీన డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఆయిల్‌, రవాణా తదితర పరికరాల దిగుమతులు క్షీణతలో ఉండడం ఇక్కడ గమనార్హం. 
- ఆదిత్య నయ్యర్‌, ఐసీఆర్‌ఏ ప్రిన్సిపల్‌ ఎకనమిస్ట్‌

 



You may be interested

అవసరమైనప్పుడు మరిన్ని చర్యలుంటాయ్‌

Saturday 14th December 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రంగాలకు మరిన్ని ప్రోత్సాహక చర్యలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. వృద్ధికి ప్రోత్సాహకంగా అవసరమైనప్పుడు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగాన్ని పెంచడం ద్వారా వృద్ధికి ఊతమిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సీనియర్‌ అధికారులతో కలసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. వస్తు,

కొత్త ఫిర్యాదుల గురించి తెలియదు

Saturday 14th December 2019

- ‘క్లాస్ యాక్షన్ దావా’ వార్తలపై ఇన్ఫోసిస్ వివరణ న్యూఢిల్లీ: అమెరికాలో కొత్తగా మరో క్లాస్ యాక్షన్ దావా దాఖలైనట్లు వచ్చిన వార్తలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పందించింది. అక్టోబర్‌లో వచ్చిన ఆరోపణలు తప్ప కొత్త ఫిర్యాదుల గురించి తమకేమీ తెలియదని శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజీలకు వివరణనిచ్చింది. గతంలో వచ్చిన ఆరోపణల గురించి అప్పుడే ఎక్స్చేంజీలకు తెలియజేశామని కూడా పేర్కొంది. అనైతిక విధానాలతో ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేసిందనే ఆరోపణతో ఇన్ఫీపై

Most from this category