News


వజ్రాల ఎగుమతులకు వైరస్‌..!

Tuesday 3rd March 2020
news_main1583206164.png-32231

ముంబై: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 వైరస్ మరింతగా ప్రబలుతున్న నేపథ్యంలో భారత వజ్రాల ఎగుమతులు గణనీయంగా తగ్గనున్నాయి. 2020-21 ఆఖరు నాటికి 19 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోనున్నాయి. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలోనూ ఎగుమతులు తగ్గడమో లేదా అదే స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. 2018-19లో భారత్‌ నుంచి వజ్రాల ఎగుమతులు 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో భారత్ నుంచి మొత్తం వజ్రాల ఎగుమతులు విలువపరంగా 18 శాతం తగ్గాయి. వీటిలో 40 శాతం ఎగుమతులు హాంకాంగ్‌కి జరిగాయి. అయితే, జనవరి 15 నుంచి హాంకాంగ్‌కు ఎగుమతులు నిల్చిపోయాయి. 
    "ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో ఎగుమతులు మరింత తగ్గవచ్చు. ఆగ్నేయాసియా ప్రాంతంలో సెలవులు, కోవిడ్19 వైరస్‌ వ్యాప్తితో మార్కెట్లు మూతబడటం మొదలైన అంశాల కారణంగా ఈ ఒక్క త్రైమాసికంలోనే దాదాపు 1 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడి ఉంటుందని అంచనా" అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సుబోధ్ రాయ్ తెలిపారు. ఇప్పటికే డిమాండ్ పడిపోయి, వసూళ్లు తగ్గిపోవడం.. హాంకాంగ్‌లో రాజకీయ సంక్షోభం వంటి సమస్యలతో సతమతమవుతున్న వజ్రాల పరిశ్రమకు కోవిడ్‌19 మరో కొత్త సమస్యగా పరిణమించిందని పేర్కొన్నారు. ఒకవేళ వచ్చే రెండు నెలల్లో వైరస్‌ అదుపులోకి వచ్చినా.. వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య భాగంలో గానీ వజ్రాల వ్యాపార పరిస్థితి చక్కబడకపోవచ్చని చెప్పారు. 



You may be interested

పౌల్ట్రీకి రూ. 1,750 కోట్ల నష్టాలు

Tuesday 3rd March 2020

వైరస్ వదంతులతో పౌల్ట్రీకి రూ. 1,750 కోట్ల నష్టాలు ఆదుకోవాలంటూ కేంద్రానికి పరిశ్రమ వినతి న్యూఢిల్లీ: చికెన్ వల్ల కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రబలుతోందన్న వదంతుల మూలంగా పౌల్ట్రీ పరిశ్రమ గణనీయంగా దెబ్బతింది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 1,750 కోట్ల మేర నష్టాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో తక్ష౾ణం సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ కేంద్ర పశు సంవర్ధక శాఖకు పౌల్ట్రీ రంగం విజ్ఞప్తి చేసింది. చికెన్‌కు డిమాండ్ తగ్గిపోవడంతో కోళ్ల

ప్రపంచ ఎకానమీకి వైరస్‌ ముప్పు!!

Tuesday 3rd March 2020

ఈ క్వార్టర్‌లో మందగించనున్న వృద్ధి దశాబ్దకాలంలో తొలిసారి ఓఈసీడీ నివేదిక ప్యారిస్‌: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కోవిడ్19 (కరోనా వైరస్‌) కారణంగా ఈ త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా మందగించనుంది. దాదాపు దశాబ్దకాలం నాటి ఆర్థిక సంక్షోభం తర్వాత త్రైమాసికాలవారీగా చూస్తే వృద్ధి మందగించనుండటం ఇదే తొలిసారి. వైరస్‌ ప్రభావాలపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) రూపొందించిన ప్రత్యేక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2020లో ప్రపంచ

Most from this category