News


8 రంగాల గ్రూప్‌ వృద్ధి పేలవం

Friday 1st February 2019
news_main1549007059.png-23942

- డిసెంబర్‌లో కేవలం 2.6 శాతం
- 18 నెలల కనిష్టం

న్యూఢిల్లీ: ఎనిమిది రంగాల గ్రూప్‌ వృద్ధి రేటు డిసెంబర్‌లో నిరాశ పరిచింది. కేవలం 2.6 శాతంగా నమోదయ్యింది. గడచిన 18 నెలల్లో ఈ గ్రూప్‌ ఇంత తక్కువ స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఎమినిది రంగాల్లో క్రూడ్‌ ఆయిల్‌, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల నిరాశాకర ఫలితాలను వెలువరించాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి  సూచీ (ఐఐపీ)లో దాదాపు 41 శాతం వాటా ఉన్న ఈ ఎనిమిది రంగాల డిసెంబర్‌ పనితీరునూ వేర్వేరుగా చూస్తే...
- క్రూడ్‌ ఆయిల్‌, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల పరిశ్రమల్లో అసలు వృద్ధిలేకపోగా వరుసగా -4.3 శాతం, -4.8 శాతం, -2.4 శాతం క్షీణత నమోదయ్యింది.
- సిమెంట్‌, విద్యుత్‌ రంగాల్లో ఉత్పత్తి వృద్ధి వరుసగా 11.6 శాతం, 4 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో పోల్చిచూస్తే ఈ రంగాల వృద్ధి రేటు తగ్గింది.
- బొగ్గు, సహజవాయువు, స్టీల్‌ రంగాల్లో ఉత్పత్తి వృద్ధి వరుసగా 0.9 శాతం, 4.2 శాతం, 13.2 శాతంగా నమోదయ్యింది.
- ఫిబ్రవరిలో రెండవ వారంలో వెలువడే డిసెంబర్‌ ఐఐపీ గణాంకాలపై ఎనిమిది రంగాల తాజా ఉత్పత్తి లెక్కల ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న విశ్లేషణ ఉంది.
- ఇదిలావుండగా, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 4.8 శాతంగా ఉంది. 2017 ఇదే కాలంలో ఈ రేటు 3.9 శాతం.



You may be interested

యస్‌ బ్యాంక్‌ తాత్కాలిక సీఈవోగా అజయ్‌ కుమార్‌

Friday 1st February 2019

- పదవి నుంచి వైదొలగిన రాణా కపూర్ ముంబై: ప్రైవేటు రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌.. ఆ బ్యాంకులో నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు కొనసాగిస్తున్న అజయ్‌ కుమార్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించింది. ఈయన ఫిబ్రవరి 1 నుంచి దాదాపు నెలరోజులపాటు ఈ పదవిలో కొనసాగుతారని బ్యాంక్‌ గురువారం ప్రకటించింది. జనవరి 31తో ఎండీ, సీఈఓగా రాణా కపూర్‌ పదవీకాలం ముగియడం.. మార్చి ఒకటి నుంచి రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ ఈ

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్కామ్‌పై ప్రభుత్వ దర్యాప్తు

Friday 1st February 2019

స్వతంత్ర సీఏ సంస్థను నియమించిన కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ, రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఈ విషయమై దర్యాప్తు చేయడానికి ఒక స్వతంత్ర చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంస్థను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ నియమించింది. గురువారం జరిగిన కంపెనీ సమావేశంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అవసరమైతే తనిఖీలు చేస్తాం.... డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి రూ.97,000 కోట్లు సమీకరించిందని, కానీ

Most from this category