News


ధరలో సగం సుంకాలే.. ఇది దారుణం !

Wednesday 12th June 2019
news_main1560317039.png-26238

  • భారత్‌పై మరోసారి విరుచుకపడ్డ ట్రంప్‌ 
  • సుంకాలను పూర్తిగా తొలగించాల్సిందే 
  • ఇక భారత్‌తో వాణిజ్య యుద్ధం ! 

వాషింగ్టన్‌: అమెరికా నుంచి భారత్‌కు దిగుమతవుతున్న హార్లే డేవిడ్సన్‌ బైక్‌లపై భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ఈ సుంకం వంద శాతంగా ఉండగా, నరేంద్ర మోదీ దీనిని 50 శాతానికి తగ్గించారు. అయినా సంతృప్తి చెందని ట్రంప్‌ బైక్‌ ధరలో దాదాపు సగం సుంకాలే ఉన్నాయని, ఇది అంగీకారయోగ్యం కాదని విమర్శించారు. జపాన్‌లోని ఒసాకాలో ఈ నెల 28-29 మధ్య జీ20 సమావేశంలో మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రతి దేశంతో సంబంధాలను ఆర్థిక దృష్టితో మాత్రమే చూసే డొనాల్ట్‌ ట్రంప్‌, భారత్‌ను టారిఫ్‌ కింగ్‌గా అభివర్ణించారు. భారత ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆయన హెచ్చరించారు. హార్లే డేవిడ్సన్‌ బైక్‌లపై  ప్రస్తుతం విధిస్తున్న 50 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అమెరికా నుంచి భారత్‌కు దిగుమతయ్యే బైక్‌లపై విధిస్తున్న సుంకాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సుంకాల విషయమై సుదీర్ఘకాలంగా అమెరికా దోపిడీకి గురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య లోటు 80,000 కోట్ల డాలర్ల మేర ఉందని పేర్కొన్నారు. మొన్నటిదాకా చైనాతో సుంకాల విషయమై యుద్ధం చేసిన ట్రంప్‌ తదుపరి లక్ష్యం భారతేనని అమెరికా మీడియా భావిస్తోంది. ఈ కామర్స్‌, డేటా లోకలైజేషన్‌ విషయమై భారత్‌ ఇటీవల తెచ్చిన కొత్త ఆంక్షలు అమెరికా కంపెనీలపై బాగానే ప్రభావం చూపాయని, ఇది భారత్‌లో అమెరికా కంపెనీల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని వైట్‌హౌస్‌ ఉన్నతాధికారొకరు వ్యాఖ్యానించారు. 
 



You may be interested

మాట నిలుపుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Wednesday 12th June 2019

రూ.962 కోట్ల వడ్డీ చెల్లింపులు పూర్తి ఏడు రోజుల గ్రేస్‌ పీరియడ్‌లో చెల్లింపులు న్యూఢిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ జూన్‌ 4న చెల్లించాల్సిన ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపులను మంగళవారం నాటికి పూర్తిగా చెల్లించివేసింది. సెక్యూర్డ్‌ రిడీమబుల్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లపై (ఎన్‌సీడీ) వడ్డీని ఈ కంపెనీ జూన్‌ 4న చెల్లించాల్సి ఉంది. అయితే నిధుల సమస్యతో ఈ చెల్లింపుల్లో విఫలమైంది. ఏడు రోజుల గ్రేస్‌ పీరియడ్‌లో వడ్డీ చెల్లింపులు జరుపుతామని ఈ నెల 7న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

ఉల్లి ఎగుమతుల ప్రోత్సాహకాలు రద్దు

Wednesday 12th June 2019

దేశియ మార్కెట్‌లో ఉల్లి ధరను తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలు మందగించిన ఉల్లి ఉత్పత్తి.. ఉల్లిని ప్రధానంగా సాగు చేసే రాష్ట్రాలలో కరువు పరిస్థితులే కారణం సాక్షి: దేశియ మార్కెట్‌లో పెరుగుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలను చేపట్టింది. ఉల్లి ఎగుమతులకు ఇస్తున్నా ప్రోత్సాహకాలను  ఉపసంహరించుకుంది. మెయిస్‌(మర్చండీస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమ్‌ ఇండియా) కింద ఎగుమతులను ప్రోత్సహించేందుకు 10 శాతం వరకు ప్రోత్సహకాలను ప్రభుత్వం ఇచ్చేది. ఉల్లి ఎగుమతులకు ఇస్తున్నా ప్రయోజనాలను ఉపసంహరించుకుంటున్నామని వాణిజ్య మంత్రిత్వ

Most from this category