News


ఫ్రీగా అయితే చూసేస్తాం!!

Tuesday 18th June 2019
news_main1560836511.png-26367

  • ఆన్‌లైన్ కంటెంట్‌పై 25 శాతం మంది అభిప్రాయమిది
  • తక్కువ ఫీజులు కట్టేందుకు 25% మంది సంసిద్ధత
  • బ్రైట్‌కోవ్ నివేదికలో వెల్లడి

ముంబై: ప్రకటనల బెడద ఉన్నప్పటికీ దేశీయంగా 25 శాతం మంది వినియోగదారులు ఓవర్‌ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌పై కంటెంట్‌ను ఉచితంగా చూసేందుకే ఇష్టపడుతున్నారు. పరిమితమైన ప్రకటనలతో ఎంతో కొంత చెల్లించి కంటెంట్‌ను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపే వారు పాతిక శాతం మంది ఉంటున్నారు. అంతర్జాతీయంగా వీడియో క్లౌడ్ సర్వీసులు అందించే బ్రైట్‌కోవ్ అనే సంస్థ ‘2019 ఆసియా ఓటీటీ రీసెర్చ్ రిపోర్ట్’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆన్‌లైన్ మార్కెట్ రీసెర్చ్‌, డేటా అనలిటిక్స్‌ సంస్థ యూగవ్‌తో కలిసి దీన్ని రూపొందించింది. భారత్‌లో 1,000 మంది, మొత్తం ఆసియా దేశాల్లో 9,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రకటనల సమస్య లేకపోతే కాస్త ఎక్కువ ఫీజు కట్టేందుకు కూడా సిద్ధమని 14 శాతం మంది దేశీ వినియోగదారులు వెల్లడించారు. మరో 14 శాతం మంది ఇటు ధరను, అటు యాడ్ ప్యాకేజీలను తమకు నచ్చినట్లుగా మార్చుకునే ఆప్షన్‌ ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ మాధ్యమంగా సినిమాలు, పాటలు, వీడియోలు మొదలైన కంటెంట్‌ను అ౾ందించడాన్ని ఓటీటీగా వ్యవహరిస్తారు.
బ్రేక్‌కు రెండు యాడ్స్‌...
ఇక ఒకసారి బ్రేక్ వస్తే రెండు ప్రకటనల దాకా భరించవచ్చని 22 శాతం మంది భారతీయులు పేర్కొనగా, మూడు యాడ్స్‌ కూడా చూసేందుకు 13 శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. ఓటీటీ కంపెనీలు కావాలంటే కొంత యాడ్స్‌ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని ఇటు సబ్‌స్క్రిప్షన్ ఫీజును సాధ్యమైనంతగా తగ్గించే హైబ్రీడ్ మోడల్‌ను పాటిస్తే బాగుంటుందని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. 
నెలకు 1 డాలరు కన్నా తక్కువ ఫీజు..
దేశీయంగా 37 శాతం మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఓటీటీ కంటెంట్‌కి నెలకు 1 డాలరు కన్నా తక్కువ చెల్లించడంపై మొగ్గు చూపుతుండగా, 27 శాతం మంది 1-4 డాలర్ల దాకా, 16 శాతం మంది 5-9 డాలర్ల దాకా కట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో 48 శాతం మంది ఓటీటీ యూజర్లు సబ్‌స్క్రిప్షన్ కొనసాగిస్తుండగా, 19 శాతం మంది పునరుద్ధరించుకోలేదు. వీరిలో 60 శాతం మంది మళ్లీ భవిష్యత్‌లో ఓటీటీ సర్వీసులకు మళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్‌, మొబైల్‌పై అందుబాటులో ఉండటం, తక్కువ డేటా వినియోగంతో వీడియో స్ట్రీమింగ్‌ అవడం వంటి మూడు ఫీచర్స్‌ను ఎక్కువ శాతం మంది కోరుకుంటున్నారు. You may be interested

ఎయిర్‌టెల్‌, వొడా ఐడియాలకు రూ.3,050 కోట్ల పెనాల్టీ!

Tuesday 18th June 2019

డిజిటల్‌ కమ్యూనికేసన్‌ కమిషన్‌ ఆమోదముద్ర జియోకు ఇంటర్‌కనెక్షన్‌ పాయింట్లు ఇవ్వని ఫలితం పెనాల్టీ వేసే ముందు ట్రాయ్‌ సూచనలు పరిగణనలోకి న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ కాల్స్‌కు ఇంటర్‌ కనెక్షన్‌ పాయింట్లను సమకూర్చనందుకు గాను భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు భారీ పెనాల్టీ భారం పడింది. టెలికం శాఖ అత్యున్నత నిర్ణయాల విభాగం డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) పెనాల్టీ విధించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే, టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యల

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 18th June 2019

డాలర్‌ ఇండెక్స్‌ వెనకడుగుతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు లాభపడి  1,345.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి నుంచి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ మూడు వారాల గరిష్టస్థాయి నుంచి వెనక్కి వచ్చింది. నేడు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97 స్థాయిని కోల్పోయి 96.96 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category