News


ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కి అంతర్జాతీయ గుర్తింపు

Thursday 19th September 2019
news_main1568864709.png-28419

  • ఫోర్బ్స్‌ ఉత్తమ బిజినెస్‌ స్కూళ్లలో 7వ స్థానం

హైదరాబాద్‌: నగరంలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కి గొప్ప గుర్తింపు లభించింది. ఫోర్బ్స్‌ ఉత్తమ బిజినెస్‌ స్కూల్స్‌ 2019 ర్యాంకుల్లో అంతర్జాతీయంగా ఐఎస్‌బీకి ఏడో స్థానం దక్కింది. ఏడాది ఎంబీఏ కేటగిరీలో ఆసియా వ్యాప్తంగా అత్యుత్తమ బి-స్కూల్‌గా గుర్తింపునకు నోచుకుంది. ఫోర్బ్స్‌ ర్యాంకుల్లో ఐఎస్‌బీకి చోటు లభించడం ఈ ఏడాదే మొదటి సారి. ప్రతీ రెండేళ్లకు ఒకసారి అంతర్జాతీయంగా అత్యుత్తమ బి స్కూళ్ల ర్యాంకులను ఫోర్బ్స్‌ సంస్థ ప్రకటిస్తుంటుంది. ఈ ఏడాది 100 స్కూళ్లను ర్యాంకులకు పరిగణనలోకి తీసుకుంది. 17,500 మందికి పైగా ఆయా స్కూళ్ల పూర్వ విద్యార్థులను సర్వే చేసింది. ఎంబీఏ తర్వాత వారికి లభిస్తున్న పారితోషికం, కెరీర్‌ ఎంపికలు తదితర ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంది. కాగా, ఫోర్బ్స్‌ ఉత్తమ బిజినెస్‌ స్కూల్స్‌ 2019లో చోటు దక్కడం పట్ల ఐఎస్‌బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాస్తవ సంతోషం వ్యక్తం చేశారు. 



You may be interested

నష్టాల ప్రారంభం

Thursday 19th September 2019

రెండు రోజుల పతనం తర్వాత క్రితం రోజు స్వల్పంగా కోలుకున్న భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం తిరిగి నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 75 పాయింట్ల నష్టంతో 36,500 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 10,810 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. గత రాత్రి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పావుశాతం మేర వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ, ఈ ఏడాది ఇక రేట్ల కోత వుండబోదని సంకేతాలివ్వడంతో ఆసియా

శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎం’ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్లు

Thursday 19th September 2019

‘ఎం10, ఎం30’ వేరియంట్స్‌ విడుదల ధరల శ్రేణి రూ. 8,999 - 16,999 గురుగ్రామ్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ ‘శాంసంగ్‌’ తాజాగా తన ‘గెలాక్సీ ఎం’ సిరీస్‌లో రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పండుగల సీజన్‌ సందర్భంగా ‘ఎం10, ఎం30’ పేరిట వీటిని ఇక్కడ విడుదలచేసింది. ‘గెలాక్సీ ఎం10’ స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో లభిస్తుండగా.. ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ. 8,999

Most from this category