News


ఈ ఏడాది ఫార్మా వృద్ధి 11-13 శాతం

Tuesday 9th July 2019
news_main1562651512.png-26916

  • ఈ ఏడాది ఫార్మా వృద్ధి 11-13 శాతం
  • దేశీయంగా 9-10 శాతం గ్రోత్‌
  • ఇక్రా నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 11-13 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఇక్రా వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో ఆర్యోగకర డిమాండ్‌ ఇందుకు కారణమని వివరించింది. అలాగే యూఎస్‌ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నూతన ఉత్పత్తుల విడుదల, ఇప్పటికే విక్రయిస్తున్న మందుల విషయంలో కంపెనీల వాటా పెరగడం వంటి అంశాలు పరిశ్రమను నడిపిస్తాయని తెలిపింది. ధరల నియంత్రణ, జనరిక్స్‌ తప్పనిసరి చేయడం, తయారీ కేంద్రాలపై యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీల వంటి రెగ్యులేటరీ పరమైన జోక్యం వృద్ధిని పరిమితం చేస్తాయని అభిప్రాయపడింది. 21 కంపెనీల ఆధారంగా ఇక్రా ఈ నివేదికను రూపొందించింది. 2018-19లో భారత ఫార్మా ఇండస్ట్రీ వృద్ధి 12 శాతంగా ఉంది. 2018-19లో డాలరుతో పోలిస్తే రూపాయి 8.4 శాతం పతనం కంపెనీల యూఎస్‌ మార్కెట్‌ వాటా వృద్ధికి తోడ్పడింది.
యూఎస్‌ మార్కెట్లో ఇలా...
ఇక్రా ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ధరల ఒత్తిడి స్థిరంగా ఉండడం, ప్రత్యేక ఉత్పత్తులు, తక్కువ పోటీ ఉన్న ఔషధాల విడుదల, కొనుగోలు చేసిన వ్యాపారాల కన్సాలిడేషన్‌ వంటివి భారతీయ కంపెనీల యూఎస్‌ మార్కెట్‌ వాటా వృద్ధికి దోహదం చేసే అంశాలు. యూఎస్‌లో ఏఎన్‌డీఏ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసిన అరబిందో, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్లెన్‌మార్క్‌ తదితర కంపెనీలు రానున్న రోజుల్లో వృద్ధికి కారణం కానున్నాయి. 2019 జనవరి-మార్చిలో యూరప్‌, యూఎస్‌ విపణి మద్దతుతో భారత ఫార్మా ఇండస్ట్రీ ఆదాయం వృద్ధి 11.8 శాతంగా నమోదైంది. యూఎస్‌ విషయంలో ఇది 21.2 శాతంగా ఉందని ఇక్రా కార్పొరేట్‌ రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గౌరవ్‌ జైన్‌ తెలిపారు. కొన్ని సంస్థల ఆదాయం తగ్గినప్పటికీ యూరప్‌ వృద్ధి 18.8 శాతంగా ఉంది. గత దశాబ్దంతో పోలిస్తే భారత కంపెనీలు ఔషధాల అభివృద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. దీంతో అభివృద్ధి చెందిన మార్కెట్లలో కొత్త అవకాశాలను అందుకునేలా చేస్తోంది.
ప్రత్యేక ఔషధాలపై ఫోకస్‌...
గతంతో పోలిస్తే పలు భారతీయ కంపెనీలు ఆర్‌అండ్‌డీలో పెట్టుబడులను పెంచాయి. 2010-11లో ఆర్‌అండ్‌డీ వ్యయం అమ్మకాల్లో 5.9 శాతముంటే, 2016-17 వచ్చేసరికి ఇది 9 శాతానికి వచ్చి చేరింది. 2017-18లో 8.8 శాతం, గత ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతంగా ఉన్నట్టు ఇక్రా వివరించింది. నియంత్రిత మార్కెట్లు, ఇంజెక్టేబుల్స్‌, ఇన్‌హేలర్స్‌, డెర్మటాలజీ, బయో సిమిలర్లపై కంపెనీల ఫోకస్‌ నేపథ్యంలో ఆర్‌అండ్‌డీ వ్యయాలు 7.5-8 శాతంగా ఉంటాయని అంచనా వేసింది. ఇక ప్రత్యేక ఔషధాలు, మాలిక్యూల్స్‌, క్లిష్ట చికిత్సలకు అవసరమయ్యే మందుల తయారీపై భారత కంపెనీలు ఫోకస్‌ చేశాయి. ధరల ఒత్తిడి, ఏఎన్‌డీఏ అనుమతులు వేగంగా రావడంతో నెలకొన్న పోటీ, ఊహించినదాని కంటే తక్కువ ఆదాయ వృద్ధి వంటి యూఎస్‌ మార్కెట్‌లో ఉన్న పరిస్థితులనుబట్టే భారత కంపెనీలు తమ దృక్పథాన్ని మార్చుకున్నాయి. సులభంగా తయారు చేయగలిగే ఉత్పత్తులు, ఎక్కువ కంపెనీలు పోటీ పడుతున్న సాధారణ జనరిక్స్‌ అభివృధ్ది నుంచి వైదొలగడంతోపాటు క్లిష్ట జనరిక్స్‌, ప్రత్యేక ప్రొడక్టులపై భారత ఫార్మా సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. You may be interested

ఈఈఎస్‌ఎల్ నుంచి ఏసీలు

Tuesday 9th July 2019

1.5 టన్నుల ఇన్వర్టరు ఏసీ రేటు రూ. 41,300 తొలి దశలో ఢిల్లీలో 50వేల యూనిట్ల విక్రయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ (ఈఈఎస్‌ఎల్‌) తాజాగా ఎయిర్‌కండీషనర్స్‌ విక్రయం ప్రారంభించింది. 1.5 టన్నుల సామర్థ్యమున్న ఇన్వర్టర్‌ ఏసీ ధర రూ. 41,300గా ఉంటుందని కంపెనీ ఈఈఎస్‌ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ తెలిపారు. కేంద్ర విద్యుత్‌ శాఖలో భాగమైన నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు జాయింట్‌ వెంచర్‌ సంస్థగా ఈఈఎస్‌ఎల్

ఎయిరిండియా ప్రైవేటీకరణ ఒప్పుకోం

Tuesday 9th July 2019

చైర్మన్‌తో భేటీలో ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ ముంబై: నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రైవేటీకరణతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు నెలకొన్న దరిమిలా యాజమాన్యానికి తమ ఆందోళన గురించి తెలియజేశాయి. ప్రైవేటీకరణ ప్రణాళికపై సోమవారం చైర్మన్‌ అశ్వనీ లోహానీతో జరిగిన సమావేశంలో 13 ఉద్యోగ సంఘాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు

Most from this category