News


జోరుమీదున్న లాజిస్టిక్స్‌!

Thursday 20th June 2019
news_main1561016176.png-26441

  • 2020 నాటికి 215 బిలియన్‌ డాలర్లకు
  • 3.8 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి
  • కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ అంచనా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో లాజిస్టిక్, వేర్‌ హౌజ్‌ విభాగం ఫుల్‌ జోష్‌లో ఉంది. మౌలిక రంగ హోదా, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి నిర్మాణాత్మక సంస్కరణల అమలు వల్ల దేశీయ లాజిస్టిక్‌ విభాగంలో డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది ముగిసే నాటికి దేశంలో 3.8 కోట్ల చదరపు అడుగుల లాజిస్టిక్‌ అండ్‌ వేర్‌ హౌజ్‌ స్థలం అందుబాటులోకి వస్తుందని కన్సల్టెన్సీ సంస్థ జోన్స్‌లాంగ్‌ లాసెల్లె (జేఎల్‌ఎల్‌) నివేదిక తెలియజేసింది.
215 బిలియన్‌ డాలర్లకు పరిశ్రమ...
ఏటా దేశీయ లాజిస్టిక్‌ విభాగం 33.81 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2020 నాటికి ఈ పరిశ్రమ 215 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని జేఎల్‌ఎల్‌ అంచనా వేసింది. ‘‘2018లో 3.2 కోట్ల చదరపుటడుగుల స్థలం లీజుకు తీసుకోగా.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి కాలంలో 84 లక్షల చ.అ. స్థలాన్ని తీసుకున్నారు. ఇంజనీరింగ్, ఆటో మరియు అనుబంధ సంస్థలు, ఈ–కామర్స్, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, టెలికం విభాగాలు లాజిక్టిక్‌ వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయి’’ అని జేఎల్‌ఎల్‌ ఇండియా కంట్రీ హెడ్‌ అండ్‌ సీఈఓ రమేష్‌ నాయర్‌ చెప్పారు. లాజిస్టిక్‌ సప్లయి చైన్‌లో జీఎస్‌టీ రాకతో సవాళ్లు తొలగాయని, ఒకే రకం పన్ను విధానం అమల్లోకి రావటంతో లావాదేవీలు, పన్ను వసూళ్లలో స్పస్టత ఏర్పడిందని చెప్పారాయన. అందుకే ఈ రంగంలో డిమాండ్‌ పెరిగిందన్నారు

హైదరాబాద్‌లో ఈ–కామర్స్‌దే హవా
హైదరాబాద్‌లో గిడ్డంగులకు ప్రధానంగా ఈ-కామర్స్‌ రంగం నుంచే డిమాండ్‌ వస్తోంది. 2017లో నగరంలో 20 లక్షల చ.అ. వేర్‌ హౌజ్‌ లావాదేవీలు జరగగా.. 2018 నాటికి ఇది వంద శాతం వృద్ధితో 40 లక్షలకు చేరింది. మొత్తం లీజు/కొనుగోళ్ల లావాదేవీల్లో ఈ–కామర్స్‌ విభాగం వాటా 40 శాతం వరకూ ఉన్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది. ఇందులోనూ 70 శాతం లావాదేవీలు జీడిమెట్ల – మేడ్చల్‌– కొంపల్లి క్లస్టర్‌లోనే జరిగాయని పేర్కొంది. శంషాబాద్, పటాన్‌చెరు క్లస్టర్స్‌ కూడా ముఖ్యమైనవేనని తెలిపింది

గిడ్డంగుల రంగంలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ జోరు
-నైట్‌ ఫ్రాంక్‌ తాజా నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: గిడ్డంగుల రంగంలో గత కొన్నేళ్లలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ప్రోపర్టీ కన్సల్టెంట్‌, నైట్‌ ఫ్రాంక్‌ తాజా నివేదిక పేర్కొంది 2014 నుంచి చూస్తే, ఇప్పటివరకూ మొత్తం 47,385 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించింది. జీఎస్‌టీ అమలు తర్వాత తయారీదారులు, ఈ కామర్స్‌ సంస్థల నుంచి లాజిస్టిక్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతోందని, అందుకే ఈ స్థాయిలో ఈ రంగంలోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వస్తున్నాయని వివరించింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..., 
-గత ఏడాది  వేర్‌ హౌసింగ్‌ స్పేస్‌ 77 శాతం వృద్ధితో 46.2 మిలియన్‌ చదరపుటడుగులకు పెరిగింది. 
-2014 నుంచి గిడ్డంగుల రంగంలో వచ్చిన రూ.47,385 కోట్ల పెట్టుబడుల్లో ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) సం‍‍స్థల వాటా 49 శాతంగా ఉంది. సావరిన్ ఫండ్స్‌ పెన్షన్‌ ఫండ్స్‌ పెట్టుబడులు 31 శాతం, డెవలపర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ 20 శాతంగా ఉన్నాయి. 
-భారత తయారీ రంగ వృద్ధి... భారత గిడ్డంగుల పరిశ్రమపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపిస్తుంది. 
-భారత గిడ్డంగుల రంగంలో డెవలపర్లకు, ఇన్వెస్టర్లకు అపార అవకాశాలున్నాయి. 
-తయారీ రంగం నుంచి వేర్‌హౌసింగ్‌ స్పేస్‌ డిమాండ్‌ ప్రస్తుతం 74 కోట్ల చదరపుటడుగులుగా ఉంది. ఇది 5 శాతం చక్రగతి వృద్ధితో 2024 కల్లా 92 కోట్ల చదరపుటడుగులకు చేరుతుంది. 
-జీఎస్‌టీ అమలు, సాంకేతికంగా మెరుగుదల, థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ సంస్థల ప్రవేశం తదితర కారణాల వల్ల వేర్‌హౌసింగ్‌ సెగ్మెంట్‌ వృద్ధి సాధిస్తోంది. 
-అభివృద్ధి చెందిన దేశాల్లో జీడీపీలో లాజిస్టిక్స్‌ వ్యయం 8-10 శాతంగానే ఉంది. కానీ మన దేశంలో ఇది 13-14 శాతం మేర ఉంది. సరుకుల రవాణా 60 శాతానికి పైగా రోడ్డు రవాణా ద్వారానే జరుగుతుండటం దీనికి ప్రధాన కారణం.



You may be interested

విండోస్‌ 7కు అప్‌డేట్స్‌ నిలిపివేత

Thursday 20th June 2019

- వచ్చే ఏడాది జనవరి 14 నుంచి అమల్లోకి జైపూర్:  టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి సెక్యూరిటీ, టెక్నికల్ అప్‌డేట్స్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2020 జనవరి 14 నుంచి అప్‌డేట్స్‌ను నిలిపేస్తామని, యూజర్లు మెరుగైన లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కు మారాల్సి ఉంటుందని పేర్కొంది. యూజర్లు సులభంగా కొత్త ఓఎస్‌కు మారేలా బైబ్యాక్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు ప్రకటించడంతో  పాటు చౌకగా డివైస్‌లను తయారు చేసేలా డెల్‌,

హెచ్‌డీఎఫ్‌సీ చేతికి అపోలో మ్యూనిక్ హెల్త్‌

Thursday 20th June 2019

రూ. 1,347 కోట్ల డీల్‌ మెజారిటీ వాటాల కొనుగోలు తొమ్మిది నెలల్లో ప్రక్రియ పూర్తి ముంబై: గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్‌ సంస్థలో మెజారిటీ వాటాలు దక్కించుకుంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ నుంచి రూ. 1,347 కోట్లకు ఈ వాటాలు కొనుగోలు చేస్తోంది. ఇకపై దీన్ని సొంత బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లో విలీనం చేయనుంది. డీల్ ప్రకారం అపోలో హాస్పిటల్స్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ

Most from this category