News


భారత ఐటీ కంపెనీల్లో పెరిగిన అమెరికన్‌ ఉద్యోగులు!

Saturday 22nd February 2020
news_main1582367765.png-32012

లక్షకుపైగా పనిచేస్తున్నారన్న నాస్కామ్‌
 అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ ఐటీ కంపెనీలలో లక్షకుపైగా అమెరికన్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని తాజాగా నాస్కామ్‌ డేటా వెల్లడించింది. ఈ డేటా ప్రకారం అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్‌ నాలుగు ఇండియన్‌ ఐటీ కంపెనీలలో ఒక్కో కoపెనీలో అమెరికన్‌ ఉద్యోగులు 55,000పైగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పటిదాక అమెరికాలో ఉద్యోగాలు చేసే బారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండేది. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. అమెరికన్ల ఉద్యోగ కల్పనే లక్ష్యంగా హెచ్‌1బీ విసా నిబంధనలను ట్రంప్‌ మరింత కఠినం చేశారు. దీంతో అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ కంపెనీలు సైతం అమెరికన్‌లకే ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీసా సమస్యలు తలెత్తుతుండడం, ఐటీ కంపెనీల వ్యాపారాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు స్థానికులను ఉద్యోగాల్లో తీసుకుంటుండంతో గత కొద్ది సంవత్సరాలు భారతీయ కంపెనీలలో అమెరికా ఉద్యోగుల సంఖ్య పెరిగందని నాస్‌కామ్‌ వెల్లడించింది. సాఫ్ట్‌వేర్‌ జెయింట్‌ అయిన కాగ్నిజెంట్‌ ఇండియన్‌ కంపెనీ అయినప్పటికీ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. దీంతో ఇండియన్‌ కంపెనీలలో  లక్షకు పైగాఉన్న అమెరికా ఉద్యోగులలో ఉత్తర అమెరికాలోని కాగ్నిజెంట్‌ కార్యాలయంలో 46,400 మంది అమెరికన్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక మిగతా కంపెనీలైన టీసీఎస్‌లో 20,000, ఇన్ఫోసిస్‌లో 14,000, హెచ్‌సీఎల్‌లో 13,400, విప్రోలో 10,000 మంది అమెరికన్‌ ఉద్యోగులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య మొత్తం అమెరికన్‌ ఉద్యోగులలో 70 శాతంగా ఉంది. కాగా ఇన్ఫోసిస్‌ 2017లో 10 వేలమంది అమెరికన్‌ ఉద్యోగులను కంపెనీలోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని. ఇప్పుడు ఆ టార్గెట్‌ను చేరుకుందని నాస్కామ్‌ తెలిపింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ రిసెర్చ్‌ సంస్థ అంచనాల ప్రకారం 2018 ఆర్థిక సంవత్సరంలో  వీసాలతో ఉన్న వారితో కలిపి అమెరికాలో ఉన్న ఇండియన్‌ కంపెనీలలో మొత్తం 1.7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా 2015 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 1.5 లక్షలుగా ఉంది. వీరికి జీతాలు కూడా సగటున 96,300 డాలర్లను చెల్లిస్తున్నట్లు మార్కిట్‌ తెలిపింది. అయితే ఎక్కువ మంది అమెరికన్‌ ఉద్యోగులను చేర్చుకోవడం వెనక విసా సమస్య ఒక్కటే కారణం కాదని, ప్రస్తుతం ఐటీ కంపెనీలన్నీ డిజిటల్‌ అవుట్‌ కమ్‌ బేస్డ్‌ వర్క్‌ నిర్వహిస్తుండడం వల్ల ఆయా కంపెనీలు క్లైంట్‌లకు దగ్గరగా ఉండాల్సి రావడంతో స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్‌ అరడజనుకుపైగా టెక్నాలజీ సెంటర్లను ఇండియాన, కనెక్టికట్‌, రోహ్డే ఐస్‌లాండ్‌, టెక్సాస్‌, నార్త్‌ కరోలినా, ఆరిజోనాలలో ఏర్పాటు చేసింది. ఎక్కువ మంది స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం వల్ల రిక్రూట్‌మెంట్‌లో సబ్‌కాంట్రాక్టర్లకు  అయ్యే ఖర్చు కూడా తగ్గుతుందని, వారి మీద ఆధారపడాల్సి అవసరం ఉండదని ఇండియన్‌ కంపెనీలు భావిస్తున్నాయి. కాగా 2018-19 మధ్య కాలంలో ఇన్ఫోసిస్‌ సబ్‌కాంట్రాక్టర్లకయ్యే ఖర్చు 40 శాతం పెరిగి, అంతకుముందు ఏడాది రూ.4,298 కోట్ల నుంచి రూ.6,031 కోట్లకు చేరింది. ఇక టీసీఎస్‌ సబ్‌కాంట్రాక్టింగ్‌ ఖర్చు 26 శాతం పెరిగి 11,330 కోట్లకు చేరింది. వీటన్నింటిని అధిగమించడానికి స్థానిక ఉద్యోగుల వైపు ఇండియన్‌ ఐటీ కంపెనీలు మొగ్గు చూపుతుండడంతో ఇండియన్‌ ఐటీ కంపెనీలలో అమెరికన్‌ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. 
 You may be interested

ఇక నిమిషాల్లో ఉచితంగా పాన్‌

Sunday 23rd February 2020

ఇప్పటి వరకు ఆదాయపన్ను శాశ్వతా ఖాతా నంబర్‌ (పాన్‌) తీసుకుని లేరా..? ఇప్పుడు పాన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా..? ఇకపై పాన్‌ నిమిషాల్లో తీసుకోవచ్చు. కాకపోతే ఆధార్‌ నంబర్‌ ఉండాలి. ఆధార్‌ నంబర్‌ సాయంతో ఇన్‌స్టంట్‌గా పాన్‌ను జారీ చేసే విధానాన్ని ఆదాయపన్ను శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో పేపర్లతో పని లేకుండా, ఎటువంటి చార్జీలు చెల్లించే పని లేకుండా, ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌గా పాన్‌ జారీ అయిపోతుంది.    ఆదాయన్ను శాఖకు చెందిన

ఈ ఐదింటిపై ఐసీఐసీఐ డైరెక్ట్‌ బుల్లిష్‌

Saturday 22nd February 2020

క్యు3 ఫలితాల్లో సత్తా చూపిన టాప్‌ కంపెనీపై ఐసీఐసీఐ డైరెక్ట్‌ బుల్లిష్‌గా ఉంది. అపోలో హాస్పిటల్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హీరో మోటో కార్‌‍్ప, కేఈసీ ఇంటర్నేషనల్‌ షేర్లపై బ్రోకరేజ్‌ కొనొచ్చు రేటింగ్‌ ఇచ్చింది. ఈ కంపెనీలు మౌలికంగా బలంగా ఉన్నాయని, స్థిర ప్రదర్శన చూపుతాయని తెలిపింది. క్యు3లో మందగమన ప్రభావం ఉన్నా పలు కంపెనీలు అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు ప్రకటించాయని అభిప్రాయపడింది.  బ్రోకరేజ్‌ కొనొచ్చంటున్న ఐదు షేర్లు, వాటి

Most from this category