STOCKS

News


ఐటీ కంపెనీలకు ‘బోయింగ్‌’ షాక్‌!

Saturday 28th December 2019
news_main1577504791.png-30486

  • బిలియన్‌ డాలర్ల వ్యాపారం ఆగిపోయే ప్రమాదం
  • 737 మ్యాక్స్‌ విమాన తయారీని నిలిపివేయడం వల్లే

న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలకు బోయింగ్‌ సంస్థ నుంచి వచ్చే వ్యాపారానికి గండి పడనుంది! ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ నుంచి బిలియన్‌ డాలర్ల వ్యాపారం ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. బోయింగ్‌ తన ప్రతిష్టాత్మక 737 మ్యాక్స్‌ సిరీస్‌ విమానాల తయారీని జనవరి నుంచి నిలిపివేయనుంది. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, సైయంట్‌, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ ప్రస్తుతం బోయింగ్‌ సంస్థతో వ్యాపార అనుబంధం కలిగి ఉన్నాయి. ‘‘చాలా భారత ఐటీ కంపెనీలకు బోయింగ్‌ ప్రముఖ క్లయింట్‌గా ఉంది. కనుక స్వల్ప కాలంలో ఈ కంపెనీలపై తప్పక ప్రభావం ఉంటుంది. బోయింగ్‌ ఎదుర్కొంటున్న సమస్యల వల్ల ఏరోస్పేస్‌ విభాగంలో వ్యయాలు కూడా తగ్గిపోతాయి’’ అని ఐటీ అవుట్‌సోర్సింగ్‌ అడ్వైజర్‌, పారీక్‌ కన్సల్టింగ్‌ వ్యవస్థాపకుడు పారీక్‌ జైన్‌ తెలిపారు. మ్యాక్స్‌ 737 విమాన తయారీని ఈ నెలారంభంలోనే బోయింగ్‌ తాత్కాలికంగా నిలిపివేయగా, జనవరి నుంచి తన సరఫరాదారులు సరఫరాను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థ తన సీఈవో డెన్నిస్‌ ములెన్‌బర్గ్‌కు ఈ వారమే ఉద్వాసన కూడా పలకడం గమనార్హం. ఇండోనేషియా, ఇథియోపియాల్లో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కూలిపోయిన ఘటనల నేపథ్యంలో నియంత్రణ సంస్థల విశ్వాసాన్ని బోయింగ్‌ కోల్పోయింది. ఇదే సీఈవోను సాగనంపేందుకు దారితీసింది. 
సగం వాటా...
విమానయాన ఇంజనీరింగ్‌ అవుట్‌సోర్సింగ్‌ మార్కెట్‌ పరిమాణం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. బోయింగ్‌, ఎయిర్‌బస్‌ సమానంగా వాటా కలిగి ఉన్నాయి. బోయింగ్‌ సంస్థ 2 బిలియన్‌ డాలర్ల విలువైన సేవలను అవుట్‌సోర్సింగ్‌ ఇస్తుండగా, ఇందులో సగానికి సగం మన దేశ ఐటీ కంపెనీలే సొంతం చేసుకుంటున్నాయి. వీటితోపాటు అస్సెంచుర్‌, క్యాప్‌జెమినీ సంస్థలు కూడా ఈ విభాగంలో ముందున్నాయి. బోయింగ్‌కు ఇంజన్లను ప్రట్‌ అండ్‌ విట్నే, రోల్స్‌రాయిస్‌, జనరల్‌ ఎలక్ట్రిక్‌, శాఫ్రాన్‌.. విమాన విడిభాగాలను స్పిరిట్‌ ఏరోసిస్టమ్స్‌, శాఫ్రాన్‌ సమకూరుస్తున్నాయి. రాక్‌వెల్‌, హానీవెల్‌ సంస్థలు ఏవియోనిక్స్‌ను సమకూరుస్తున్నాయి. ‘‘చాలా వరకు భారత ఐటీ సంస్థలు నేరుగా బోయింగ్‌ సంస్థతో, సరఫరా వ్యవస్థతో అనుబంధం కలిగి ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, సైయింట్‌ నేరుగా బోయింగ్‌తో వ్యాపారం కలిగి ఉంటే, విడిభాగాల సరఫరాదారు స్పిరిట్‌ ఏరోసిస్టమ్‌ ఇన్ఫోసిస్‌ క్లయింట్‌గా ఉంది’’ అని అవుట్‌సోర్సింగ్‌ మార్కెట్‌ ప్రముఖుడొకరు తెలిపారు.
ఒప్పందాల్లో రక్షణ ఉంటుంది.. 
‘‘సాధారణంగా అవుట్‌సోర్స్‌ కాంట్రాక్టుల్లో రక్షణకు సంబంధించి నిబంధనలు ఉంటాయి. రద్దు కారణంగా తలెత్తే నష్టాల నుంచి ఐటీ కంపెనీలకు రక్షణ ఉంటుంది. అయితే, స్వల్ప కాలానికి లాభదాయకపై కచ్చితంగా ప్రభావం పడుతుంది’’ అని గ్రేహౌండ్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో సంచిత్‌విర్‌ గోగియా వివరించారు. బోయింగ్‌తో తమ వ్యాపారబంధంపై సరఫరాదారులు అందరూ దీర్ఘకాలిక అభిప్రాయంతో ఉంటారని, స్వల్పకాలిక అవరోధాలను అవి అధిగమించగలరని అభిప్రాయపడ్డారు. ‘‘ఇంజనీరింగ్‌ సేవల సంస్థలు మాత్రం ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నాయి. ఎందుకంటే బోయింగ్‌ 737 మ్యాక్స్‌ను నిలిపివేస్తే, అప్పుడు 797 మోడల్‌పై అధిక వ్యయాలు చేస్తుందన్న అంచనాతో ఉ‍న్నాయి. భారత ఇంజనీరింగ్‌ సేవల సంస్థలకు ఇది సానుకూలమే’’ అని మరొక నిపుణుడు పేర్కొన్నారు. బోయింగ్‌ 797 అనేది కొత్త తరహా విమానం. ఇది 225-275 సీట్ల సైజుతో ఉంటుంది. 

బోయింగ్‌ సరఫరా వ్యవస్థ
ఇంజన్‌ తయారీదారులు: ప్రట్‌ అండ్‌ విట్నే, రోల్స్‌రాయిస్‌, జనరల్‌ ఎలక్ట్రిక్‌, శాఫ్రాన్‌
విడిభాగాల సరఫరాదారులు: స్పిరిట్‌ ఏరోసిస్టమ్స్‌, శాఫ్రాన్‌
ఏవియోనిక్స్‌ (ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌): రాక్‌వెల్‌, హానీవెల్‌
భారత కంపెనీలపై ప్రభావం
భారత ఐటీ కంపెనీలు అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌, ఇంజనీరింగ్‌, ఏవియోనిక్స్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను బోయింగ్‌ 737 విమాన తయారీ కార్యక్రమానికి అందిస్తున్నాయి. You may be interested

కేంద్రానికి రూ.2,611 కోట్ల డివిడెండ్‌

Saturday 28th December 2019

 చెల్లించిన ఎల్‌ఐసీ  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్‌ఐసీ గత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2,611 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈ మేరకు చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎమ్‌.ఆర్‌. కుమార్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి దేబాశిష్‌ పాండాలు కూడా పాల్గొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ 10 శాతం వృద్ధితో రూ.53,214 కోట్ల

ఓటీపీతోనే ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి నగదు

Saturday 28th December 2019

జనవరి 1 నుంచి అమల్లోకి రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు లావాదేవీలకు మరింత భద్రత న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఏటీఎంకు చీకటి పడిన తర్వాత వెళుతున్నారా..? కార్డుతోపాటు, చేతిలో మొబైల్‌ ఫోన్‌ కూడా ఉండాలి. ఎందుకంటే ఓటీపీ సాయంతోనే నగదు ఉపసంహరణ జరిగే విధానాన్ని ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా తన ఏటీఎంలలో ప్రవేశపెడుతోంది. రూ.10,000, అంతకుమించి నగదు ఉపసంహరణలకు మాత్రమే ఇది అమలవుతుంది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి ఉదయం

Most from this category