News


ఆర్థిక రంగం ముందు సవాళ్లు: సీతారామన్‌

Monday 11th November 2019
news_main1573443196.png-29490

న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ‘ది రైజ్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌: కాజెస్‌, కన్‌సీక్వెన్సెస్‌, క్యూర్‌’ అనే పేరుతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వి.అనంత నాగేశ్వరన్‌, గుల్జార్‌ నటరాజన్‌ సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని మంత్రి ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం, భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పుస్తకం పరిష్కారాలను సూచించినట్టు చెప్పారు. ఓ పుస్తకంగా ఇది ఎంతో ప్రాచుర్యం పొందగలదని,  మరీ ముఖ్యంగా.. మనకు చాలా సందర్భోచితంగా ఉండడంతోపాటు సరైన సమయంలో విడుదల చేసినట్టు పేర్కొన్నారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఇది వచ్చినట్టు చెప్పారు. 



You may be interested

గృహ రుణంలోనూ కలసికట్టుగా..

Monday 11th November 2019

దంపతులు జాయింట్‌గా తీసుకుంటే బెటర్‌ అధిక మొత్తంలో గృహ రుణానికి వీలు కలసి దరఖాస్తు చేయడం వల్ల మెరుగైన అర్హత చెల్లింపుల భారం తగ్గుతుంది తక్కువ కాలంలోనే తీర్చేయవచ్చు తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం పన్ను ఆదా ప్రయోజనాలు కూడా ఎక్కువే ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనేకానీ నగరాల్లో జీవనశైలికి అనుగుణంగా బతుకుబండి నడిచే పరిస్థితులు లేవు. అలాంటిది... ఇల్లు సమకూర్చుకోవడం ఎంత పెద్ద ప్రహసనమో చెప్పనక్కర్లేదు!! అయితే, గృహ రుణం ఒక్కరి పేరుతో తీసుకునేకంటే దంపతులు కలసి

రిలయన్స్ గ్యాస్ రేటు తగ్గింపు

Monday 11th November 2019

న్యూఢిల్లీ: కొనుగోలుదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో కేజీ-డీ6 బ్లాక్‌లో కొత్తగా ఉత్పత్తి చేయబోయే గ్యాస్ బేస్ ధరను రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 7 శాతం తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజీ-డీ6 బ్లాక్‌లోని ఆర్‌-క్లస్టర్ క్షేత్రం నుంచి కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్‌ కొనుగోలు కోసం రిలయన్స్ బిడ్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం.. గడిచిన మూడు నెలల బ్రెంట్ క్రూడ్‌ సగటు రేటులో 9 శాతం స్థాయిలో

Most from this category