News


మన ఐటీ కంపెనీలను చూసి నేర్చుకోండి

Thursday 19th December 2019
news_main1576728444.png-30298

ఇంటే కాదు, రచ్చ కూడా గెలవాలి

ఇతర కంపెనీలకు ఇన్ఫీ క్రిస్‌ సూచన

న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలను చూసి దేశంలోని ఇతర కంపెనీలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ గోపాలకృష్ణన్‌ సూచించారు. మన ఐటీ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారాయన. దేశంలోని పలు కంపెనీలు రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, ఐటీ కంపెనీలు మాత్రం ఎలాంటి రుణభారం లేకుండా ఉన్నాయని తెలిపారు. కంపెనీలన్నీ పరిశోధన, అభివృద్ధిలపై అధికంగా పెట్టుబడులు పెట్టాలన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  భారత కంపెనీలు విదేశీ స్టాక్‌ మార్కెట్లలో కూడా లిస్ట్‌ కావాలని ఆయన సూచించారు. ‘‘చాలా దేశీయ కంపెనీలకు పోటీ అంటే భయం’’ అన్నారాయన. కంపెనీలు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను మెరుగుపరచుకోవాలని, అంతర్జాతీయంగా పోటీపడాలని సూచించారు. 1980లో 16,000 కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 2.8 లక్షల కోట్ల డాలర్లకు ఎగసిందని క్రిస్‌ తెలిపారు.  2025 కల్లా 5 లక్షల కోట్లడాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. 2025 లేదా 2030 నాటికి ఈలక్ష్యాన్ని సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు.  



You may be interested

జేఎల్‌ఆర్‌ చేతికి ‘బౌలర్‌’

Thursday 19th December 2019

న్యూఢిల్లీ: ఏ తరహా ప్రాంతంలోనైనా పరుగులు తీసే పెర్ఫామెన్స్‌ కార్లను, విడి భాగాలను, ర్యాలీ రెయిడ్‌ వాహనాల్ని తయారు చేసే బ్రిటన్‌ సంస్థ బౌలర్‌ను టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) కొనుగోలు చేసింది. ఆఫ్‌–రోడ్‌ కాంపిటీషన్‌ కార్లను కూడా తయారు చేసే బౌలర్‌ కంపెనీ ఇకపై జేఎల్‌ఆర్‌కు చెందిన స్పెషల్‌ వెహికల్‌ ఆపరేషన్స్‌ వ్యాపారంలో ఒక భాగం కానుంది.  అయితే ఎంత మొత్తానికి

ఖాతాదారులూ! కాస్త జాగ్రత్త!!

Thursday 19th December 2019

సైబర్‌ నేరాల కట్టడిపై బీవోఐ చైర్మన్‌ పద్మనాభన్‌ వ్యాఖ్య హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు బ్యాంకులు, నియంత్రణ సంస్థ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఖాతాదారులు కూడా తమ వంతుగా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జి.పద్మనాభన్‌ అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించి అసలైన పోర్టల్స్, యాప్స్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్లను ఉపయోగించడంతో పాటు పిన్‌ నంబర్లు లాంటివి ఎవరికీ వెల్లడించకుండా

Most from this category