News


విదేశీ ఎక్స్చేంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌!

Saturday 22nd February 2020
news_main1582342790.png-31998

  • ఆర్‌బీఐ గవర్నర్‌ సంకేతాలు

న్యూఢిల్లీ: విదేశీ సంస్థల నుంచి దేశానికి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే కీలక చర్యలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శ్రీకారం చుడుతోంది. విదేశీ ఎక్స్చేంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌కు తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ‘‘గ్లోబల్‌ ఇండెక్స్‌లను నిర్వహించే పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు పురోగతిలో ఉన్నాయి. అయితే ఎప్పటిలోగా ప్రభుత్వ బాండ్లు విదేశీ ఎక్స్చేంజ్‌ల్లో లిస్టవుతాయన్న విషయాన్ని మాత్రం నేను చెప్పలేను’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. విదేశీ ఎక్స్చేంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌కు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సుదీర్ఘకాలంగా సూచనలు అందుతున్నాయి. అయితే దీనికి 2020-21 బడ్జెట్‌లోనే సూత్రప్రాయ ఆమోదముద్ర పడింది. ‘‘కొన్ని నిర్దిష్ట కేటగిరీల ప్రభుత్వ బాండ్లను నాన్‌-రెసిడెంట్‌ ఇన్వెస్టర్లకు ఉద్ధేశించడం జరుగుతోంది. దేశీయ ఇన్వెస్టర్లతోపాటు విదేశీ ఇన్వెస్టర్లకూ ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి’’ అని తన ఫిబ్రవరి 1 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కాగా ద్రవ్య స్థిరత్వానికి ఆర్‌బీఐ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, 50 ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోందని గవర్నర్‌ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్యాంకులుసహా ఫైనాన్షియల్‌ విభాగం మొత్తం ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందనీ ఆయన పేర్కొన్నారు. 



You may be interested

కరోనా కాఫ్‌- యూఎస్‌ మార్కెట్‌ డీలా

Saturday 22nd February 2020

టెక్‌ దిగ్గజాలు బోర్లా.. రెండు వారాల లాభాలకు బ్రేక్‌ గత వారం 1.5 శాతం నష్టం రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్‌ ప్రభావం వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లను దెబ్బ తీసింది. ఇప్పటికే టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ క్యూ1(జనవరి-మార్చి) ఫలితాలు నీరసించనున్నట్లు అంచనా వేయగా.. తాజాగా పానీయాల దిగ్గజం కోక కోలా.. క్యూ1లో అమ్మకాలు క్షీణించనున్నట్లు ప్రకటించింది. దీంతో మార్కెట్లు 1-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. డోజోన్స్‌ 228 పాయింట్లు నష్టపోయి 28,992

భారీ టారిఫ్‌లతో దెబ్బతీస్తోంది

Saturday 22nd February 2020

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపణలు ప్రధాని మోదీతో వ్యాపారాంశాలు చర్చిస్తానని వెల్లడి వాషింగ్టన్‌: భారీ టారిఫ్‌లతో వాణిజ్యపరంగా తమ దేశాన్ని భారత్‌ చాన్నాళ్లుగా గట్టిగా దెబ్బతీస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. భారత  మార్కెట్లో అమెరికా ఉత్పత్తుల విక్రయాలకు మరింతగా అవకాశాలు కల్పించేలా ప్రధాని నరేంద్ర మోదీతో వ్యాపారాంశాలు చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కొలరాడోలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 24,25న ట్రంప్‌

Most from this category