News


బ్యాంకింగ్‌ వ్యవస్థ భద్రంగానే ఉంది

Wednesday 2nd October 2019
news_main1569991908.png-28667

  • భయపడాల్సిన అవసరం లేదు: ఆర్‌బీఐ

ముంబై: దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ సురక్షితంగా, సుస్థిరంగానే ఉందని, వదంతుల ఆధారంగా భయపడిపోవాల్సిన పని లేదని దేశ ప్రజలకు భరోసానిస్తూ ఆర్‌బీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకులో సంక్షోభంతోపాటు బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి ప్రతికూల వార్తలు చలామణీ అవుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘కొన్ని బ్యాంకులు, కోపరేటివ్‌ బ్యాంకుల పట్ల వదంతులు చలామణీ అవుతున్నాయి. ఇవి డిపాజిటర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ భద్రంగా, స్థిరంగా ఉందని, ఈ వదంతులను విని భయపడిపోవాల్సిన అవసరం లేదని సాధారణ ప్రజలకు ఆర్‌బీఐ హామీ ఇస్తోంది’’ అని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు మంగళవారం స్టాక్‌ మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ స్టాక్స్‌ సైతం తీవ్ర నష్టాల పాలయ్యాయి. 



You may be interested

ఫోర్డ్‌ ఇండియా ఆటో వ్యాపారం మహీంద్రా చేతికి

Wednesday 2nd October 2019

రెండు కంపెనీల ఆధ్వర్యంలో జేవీ దీని ఆధ్వర్యంలో ఫోర్డ్‌ వాహన విక్రయాలు న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార పరంగా తీవ్ర పోటీ పరిస్థితుల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ(ఎఫ్‌ఎంసీ) మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం)తో జట్టు కట్టింది. రెండు కంపెనీల ఆధ్వర్యంలోని జాయింట్‌ వెంచర్‌(జేవీ)కు ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ భారత వ్యాపార కార్యకలాపాలు బదిలీ అవుతాయి. ఈ జేవీలో ఎంఅండ్‌ఎంకు 51 శాతం వాటా, మిగిలిన 49 శాతం వాటా

అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి అంచనాలు భారీగా కుదింపు

Wednesday 2nd October 2019

2019కి 1.2 శాతానికి తగ్గించిన డబ్ల్యూటీవో న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భారీగా కుదించింది. 2019 సంవత్సరానికి 2.6 శాతం ఉంటుందని గత ఏప్రిల్‌లో ఈ సంస్థ అంచనా వేయగా, తాజాగా దీన్ని 1.2 శాతానికి కుదించింది. ఇది భారత్‌కు రుచించని విషయమే. ఎందుకంటే ఎగుమతులను పెంచుకునేందుకు మన దేశం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం గమనార్హం. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిదానిస్తున్న

Most from this category