News


జీడీపీ వృద్ధిలో బ్యాంకింగ్‌ వ్యవస్థదే కీలక పాత్ర

Friday 7th February 2020
news_main1581061661.png-31597



 టీసీఎస్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ రాజేష్‌ గోపినాథన్‌
భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ భవిష్యత్తులో పెద్దపెద్ద సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని టీసీఎస్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ రాజేష్‌ గోపినాథన్‌ అన్నారు. ఐబీఏ టెక్నాలజీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశారు. పెను సవాళ్లు ఎదురైనప్పటికీ వచ్చే దశాబ్దంలో భారత బ్యాంకింగ్‌ వ్యస్థ భారీ వృద్ధిని సాధిస్తుందని ఆకాంక్షించారు. వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధిని సాధించే కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయని, మొండి బకాయిలు దాదాపు 10 శాతం ఉండడం, మందగించిన క్రెడిట్‌ వృద్ధితో బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రస్తుతం నత్తనడక నడుస్తోందని, రాబోయే దశాబ్దంలో పుంజుకుంటుందన్నారు. అయితే  ప్రధాని మోదీ ప్రతిపాదించిన.. ఆర్థిక సంవత్సరం 2025 నాటికి భారత జీడీపీ 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని వివిధ కేస్‌ స్టడీలను ప్రస్తావిస్తూ ఆయన వివరించారు.



You may be interested

52 వారాల గరిష్టానికి చేరిన షేర్లివే!

Friday 7th February 2020

శుక్రవారం 52 వారాల గరిష్టానికి 58 షేర్లు పెరిగాయి. వీటిలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌, అజంతా ఫార్మా, అల్‌కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌, అర్మాన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బాటా ఇండియా, భారత్‌ రాస్‌యాన్‌, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, క్రియేటివ్‌ పెరిపెరల్స్‌ అండ్‌ డిస్ట్రీబ్యూషన్‌, ఎడెల్వీజ్‌ మ్యుచువల్‌ ఫండ్‌, ఈఐడీ ప్యారీ ఇండియా, ఎసాబ్‌ ఇండియా,

మెట్రోపోలిస్‌- యూఎస్‌ఎల్‌... జూమ్‌

Friday 7th February 2020

4 శాతం ఎగసిన మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ 52 వారాల గరిష్టానికి యునైటెడ్‌ స్పిరిట్స్‌ వరుసగా నాలుగు రోజులపాటు దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 1.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ 157 పాయింట్లు క్షీణించి 41,149కు చేరగా.. నిఫ్టీ 38 పాయింట్లు తక్కువగా 12,100 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా

Most from this category