News


62 శాతం ఎగసిన ఇండియన్‌ బ్యాంక్‌ లాభం

Saturday 25th January 2020
news_main1579923128.png-31186

  • తగ్గిన మొండి బకాయిలు 
  • క్యూ3లో రూ.4 లక్షల కోట్ల వ్యాపారం

చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 62 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.152 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.247 కోట్లకు పెరిగిందని ఇండియన్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ పద్మజా చందూర్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.5,269 కోట్ల నుంచి రూ.6,506 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.  ఇతర వివరాలు....

పెరిగిన కేటాయింపులు....
బ్యాంక్‌ రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. గత క్యూ3లో 7.46 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 7.2 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 4.42 శాతం నుంచి 3.5 శాతానికి చేరాయి. విలువ పరంగా చూస్తే, నికర మొండి బకాయిలు రూ.7,571 కోటల​ నంఉచి రూ.6,488 కోట్లకు తగ్గాయి. మొండి బకాయిలు తగ్గినప్పటికీ, కేటాయింపులు పెరిగాయి. ఈ క్యూ2లో రూ.924 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.1,529 కోట్లకు చేరాయి. ఇక ఈ క్యూ3లో బ్యాంక్‌ వ్యాపారం రూ.4 లక్షల కోట్ల మైలురాయిని దాటేసింది. 

కాగా ఈ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకుంటోంది. విలీన బ్యాంక్‌కు పెట్టాల్సిన పేరుపై కసరత్తు చేస్తోంది. బ్యాంక్‌ ఐటీ భాగస్వామిగా టీసీఎస్‌ను నియమించుకుంది. 



You may be interested

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభం 80 శాతం అప్‌

Saturday 25th January 2020

రూ.10,176 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం  నిర్వహణ లాభం రూ.1,786 కోట్లు (అప్‌డేటెడ్‌...) ముంబై: బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో 80 శాతం మేర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.396 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.712 కోట్లకు పెరిగిందని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.10,294 కోట్ల నుంచి

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టాలు రూ.1,407 కోట్లు

Saturday 25th January 2020

పెరిగిన మొండి కేటాయింపులు  స్వల్పంగా తగ్గిన మొండి బకాయిలు  ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌  బరోడాకు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి.  గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.436 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.1,407 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎమ్‌డీ, సీఈఓ సంజీవ్‌ చంద్ర తెలిపారు. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు జరపడంతో ఈ

Most from this category