STOCKS

News


ఇండియన్‌ బ్యాంక్‌ లాభం రెట్టింపు

Thursday 24th October 2019
news_main1571887007.png-29092

  • మొత్తం ఆదాయం రూ.6,045 కోట్లు 
  • నిలకడగా రుణ నాణ్యత

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రెండింతలు పెరిగింది. గతక్యూలో రూ.150 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.359 కోట్లకు పెరిగిందని ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,219 కోట్ల నుంచి రూ.6,045 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

తగ్గిన కేటాయింపులు...
ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత నిలకడగా ఉంది. గత క్యూ2లో 7.19 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.20 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు మాత్రం 4.23 శాతం నుంచి 3.54 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.752 కోట్ల నుంచి రూ.721 కోట్లకు తగ్గాయి. మొండిబకాయిలు, ఇతరాలకు కేటాయింపులు కూడా రూ.1,004 కోట్ల నుంచి రూ.909 కోట్లకు తగ్గాయి. You may be interested

హెచ్‌సీఎల్‌ టెక్‌ 1:1 బోనస్‌

Thursday 24th October 2019

7 శాతం వృద్ధితో రూ.2,711 కోట్లకు నికర లాభం  ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ ఆదాయ అంచనాలు పెంపు  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ బోనస్‌ షేర్లను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు ఒక్కో షేర్‌ను (1:1)ఉచితంగా ఇవ్వనునున్నది. అంతే కాకుండా ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికర లాభం 7 శాతం పెరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. గత

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.2,527 కోట్లు

Thursday 24th October 2019

13 శాతం వృద్ధి  3 లక్షల కోట్లు దాటిన ఆర్డర్‌ బుక్‌  ఈ క్యూ2లో 20 శాతం పెరిగిన ఆర్డర్లు  న్యూఢిల్లీ: నిర్మాణ, ఇంజినీరింగ్‌ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2,230 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.2,527 కోట్లకు పెరిగిందని ఎల్‌ అండ్ టీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.31,087

Most from this category