News


ఇండియన్‌ బ్యాంకు ఆకర్షణీయ ఫలితాలు

Tuesday 6th August 2019
news_main1565071733.png-27565

చెన్నై: ప్రభుత్వరంగ ఇండియన్‌బ్యాంకు జూన్‌ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. బ్యాంకు లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.209 కోట్లతో పోలిస్తే 75 శాతం పెరిగి రూ.366 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం కూడా రూ.5,132 కోట్ల నుంచి రూ.5,832 కోట్లకు వృద్ధి చెందింది. జూన్‌ త్రైమాసికంలో తాజాగా రూ.1,035 కోట్లు మొండి బకాయిలుగా మారాయి. అన్ని విభాగాల్లోనూ మెరుగైన వృద్ధి నమోదు చేసినట్టు ఇండియన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో పద్మజ చుండూరు పేర్కొన్నారు. ‘‘తాజా ఎన్‌పీఏలకు కళ్లెం వేయడం వల్ల నికర లాభంలో 74.5 శాతం వృద్ధి నమోదైంది. తిరిగి గాడిలో పడ్డాం. ఒత్తిడిలోని రుణాలు ఎన్‌పీఏలుగా మారకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని పద్మజ తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో తాజా ఎన్‌పీఏలను రూ.800-900 కోట్లకు కట్టడి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు ఆమె తెలిపారు. ‘‘రిటైల్‌, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యత తరహా విభాగాల్లో (ఎంఎస్‌ఎంఈ) వృద్ధి నెలకొంది. రిటైల్‌లో 25 శాతం, వ్యవసాయంలో 25 శాతం, ఎంఎస్‌ఎంఈ విభాగంలో 10 శాతం వృద్ధి సాధించాం. మొత్తం మీద క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 13.62 శాతంగా ఉంది. ఇది మాకు మరింత సౌకర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది’’ అని పద్మజ వివరించారు. మొబైల్‌ బ్యాంకింగ్‌లో లావాదేవీల్లో 300 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. 



You may be interested

ఫ్లిప్‌కార్ట్‌లో ఇక సినిమాలు కూడా..

Tuesday 6th August 2019

 వీడియో స్ట్రీమింగ్ సేవలపై సంస్థ కసరత్తు ప్రాంతీయ భాషల్లో త్వరలో అందుబాటులోకి న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను దీటుగా ఎదుర్కొనే దిశగా వాల్‌మార్ట్‌ సారథ్యంలోని ఫ్లిప్‌కార్ట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే ప్రాంతీయ భాషల్లో వీడియో స్ట్రీమింగ్ సేవలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు సోమవారం ప్రకటించింది. 'ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌' పేరిట ఈ సర్వీసు ప్రారంభించనుంది. ప్రకటనల ఆదాయంతో నిర్వహించే ఈ సర్వీసు.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఉపయోగించే యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

ఈ షేర్లు కొనొచ్చు....బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Tuesday 6th August 2019

భారతీయ స్టాక్ మార్కెట్లు ఆగస్టు 5 ట్రేడింగ్‌లో భారీగా పడిపోయాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు వాటి కీలకమైన మద్దతు స్థాయిల కంటే దిగువకు పడిపోయాయి. ఎస్ అండ్ పి బీఎస్ఈ సెన్సెక్స్ 37,000 దిగువకు పడిపోగా, నిఫ్టీ 50 10,900 స్థాయిను కోల్పోయింది. జులై 5 నుంచి అగష్టు2 వరకు స్టాక్‌ మార్కెట్‌(బిఎస్‌ఈ)లో 11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 5

Most from this category