News


ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు రూ.4,260 కోట్ల నష్టాలు

Saturday 14th December 2019
news_main1576296200.png-30222

2019-20 సంవత్సరంపై సీఏపీఏ తాజా అంచనా న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలు (ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 600 మిలియన్‌ డాలర్లకు (రూ.4,260 కోట్లు) పైగా నష్టాలను మూటగట్టుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ అంచనా వేసింది. 500-700 మిలియన్‌ డాలర్ల వరకు లాభాలకు అవకాశం ఉంటుందని ఈ ఏడాది జూన్‌లో వేసిన అంచనాలను ఈ సంస్థ పూర్తిగా మార్చేసింది. ఇండిగో, గోఎయిర్‌, స్పైస్‌జెట్‌, ఎయిరేషియా ఇండియా, విస్తారా, ఎయిర్‌ ఇండియా దేశీయంగా నమోదై కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు. జెట్‌ ఎయిర్‌వేస్‌ మూసివేత (స్థిరీకరణ), సానుకూలంగా ఉన్న చమురు ధరల నుంచి ప్రయోజనం పొందడంలో ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు విఫలమైనట్టు సీఏపీఏ తన తాజా నివేదికలో పేర్కొంది. 



You may be interested

ఆంధ్రప్రదేశ్‌లో 971 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌

Saturday 14th December 2019

5 వేల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 971 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌ అయ్యాయి. 2016–17, 2017–18 వరుసగా రెండేళ్లు వార్షిక రిటర్న్‌లు, బ్యాలెన్స్‌ షీట్లను ఫైల్‌ చేయని కారణంగా సెక్షన్‌ 248 ప్రకారం ఈ కంపెనీలను స్ట్రయిక్‌ ఆఫ్‌ చేసినట్లు ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీసెస్‌ (ఐసీఎల్‌ఎస్‌) సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. తొలిసారిగా ఈ సారి స్ట్రయిక్‌ ఆఫ్‌ అయిన కంపెనీల

అవసరమైనప్పుడు మరిన్ని చర్యలుంటాయ్‌

Saturday 14th December 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రంగాలకు మరిన్ని ప్రోత్సాహక చర్యలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. వృద్ధికి ప్రోత్సాహకంగా అవసరమైనప్పుడు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగాన్ని పెంచడం ద్వారా వృద్ధికి ఊతమిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సీనియర్‌ అధికారులతో కలసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. వస్తు,

Most from this category