News


ఈ నెల 24న ఇండియా మార్ట్‌ ఐపీఓ

Wednesday 19th June 2019
news_main1560942004.png-26425

బిజినెస్‌ ఉత్పత్తులను అందించే అతిపెద్ద ఆన్‌లైన బీటూబీ సంస్థ ఇండియా మార్ట్‌ ఇంటర్‌ మెస్‌ జూన్‌ 24న ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు(ఐపీఓ)కి రానుంది. ముఖవిలువ రూ.10గల 48.88 లక్షల షేర్లను ఐపీఓలో అందుబాటులో ఉంచనుంది. ఇష్యూ ధర శ్రేణి షేరు రూ.970-973గా నిర్ణయించింది. ఇష్యూ ప్రైస్‌బ్యాండ్‌లో పై అవధి రేటు రూ. 973 వద్ద రూ.475.59కోట్లను సమీకరించాలని సంస్థ భావిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లు జూన్‌ 21న బిడ్‌లు వేసుకునే అవకాశం ఉంది. ఐపీఓ జూన్‌ 26తో ముగియనున్నది. ప్రమోటర్లు దినేష్‌ చంద్రా అగర్వాల్‌, బ్రిజేష్‌ కుమార్‌ అగర్వాల్‌ 14.30 లక్షల షేర్లను ఇష్యూలో విక్రయించనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఇంటెల్‌ క్యాపిటల్‌(మెచ్యూరిటీస్‌), అమెడ్యూస్‌ 4 డీపీఎఫ్‌, ఆక్సన్‌ ప్రాంటీర్‌ ఇనూక్లూజన్‌ మెచ్యూరిటీస్‌ కంపెనీల మొత్తం షేర్లు 33.21లక్షల షేర్లను ఇష్యులో విక్రయించనున్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఎడెల్‌వేయిస్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, జెప్పరీస్‌ ఇండియా కంపెనీలు ఐపీఓకి మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.



You may be interested

నిఫ్టీ పుల్‌ బ్యాక్‌కు అవకాశం!

Thursday 20th June 2019

నిఫ్టీ50 బుధవారం పూర్తిగా అస్థిరంగా చలించింది. 177 పాయింట్ల శ్రేణిలో రెండు వైపులా కదలాడింది. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేటు నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించారు. అయితే, పుల్‌బ్యాక్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు అంటున్నారు.   నిఫ్టీ ఉదయం 53 పాయింట్ల లాభంతో 11,802 గరిష్ట స్థాయి వరకు పెరిగింది. ఆ తర్వాత లాభాలన్నీ కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. 11,625 వరకు చేరింది. చివరకు నష్టాలను పూర్తిగా కవర్‌

ఆద్యంతం ఊగిసలాట.. ఆఖరులో ఫ్లాట్‌ ముగింపు

Wednesday 19th June 2019

554 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌  కుప్పకూలిన మిడ్‌ క్యాప్‌ షేర్లు ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలమడంతో మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభంతో సరిపెట్టుకుంది. సెన్సెక్స్‌ 66.40 పాయింట్ల లాభంతో 39,112 వద్ద ముగిసింది. నిఫ్టీ ఎలాంటి లాభ నష్టాలు లేకుండా ఫ్లాట్‌గా గత ముగింపు స్థాయి 11,691 వద్ద స్థిరపడింది. మిడ్‌ సెషన్‌ నుంచి అటో, బ్యాంకింగ్‌, ఫార్మా, ఐటీ షేర్లలో అమ్మకాలతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ముఖ్యంగా

Most from this category