News


ఆ మూడూ తరవాతే ఇండియా!

Wednesday 22nd January 2020
news_main1579662971.png-31085

  • అమెరికా, చైనా, జర్మనీకే ఇన్వెస్టర్ల పెద్దపీట
  • అంతర్జాతీయ వృద్ధిపై సీఈవోల్లో సన్నగిల్లిన విశ్వాసం
  • భారత సీఈవోల్లో పెరిగిన ఆశాభావం
  • పీడబ్ల్యూసీ సీఈవో సర్వే వెల్లడి


దావోస్‌: అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో విశ్వాసం కనిష్ట స్థాయికి చేరింది. అయినా కానీ, అంతర్జాతీయంగా అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్‌ వారికి నాలుగో ప్రాధాన్య దేశంగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ సంస్థ సీఈవోలపై నిర్వహించిన సర్వే ‍స్పష్టం చేసింది. భారత్‌లో తమ వ్యాపార వృద్ధికి అనుకూల పరిస్థితులున్నట్టు అంతర్జాతీయంగా నిర్వహించిన ఈ సర్వేలో 9 శాతం మంది సీఈవోలు చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో భాగంగా ఈ నివేదికను పీడబ్ల్యూసీ విడుదల చేసింది. తమ ఆదాయ వృద్ధి అవకాశాల పట్ల భారత సీఈవోలు ఎంతో ఆశావహంగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. చైనాలో 45 శాతం మంది సీఈవోలు ఈ రకమైన విశ్వాసంతో ముందుండగా, ఆ తర్వాత భారత సీఈవోల్లోనే అత్యధిక విశ్వాసం వ్యక్తమైంది. 40 శాతం భారత సీఈవోలు వృద్ధి అవకాశాల పట్ల నమ్మకంగా ఉన్నారు. ఆ తర్వాత అమెరికాలో 36 శాతం, కెనడాలో 27 శాతం, బ్రిటన్‌లో 26 శాతం, జర్మనీలో 20 శాతం సీఈవోల్లో ఇదే విశ్వాసం వ్యక్తమైంది. అంతర్జాతీయంగా చూస్తే... తమ కంపెనీ అవకాశాల పట్ల సానుకూలత వ్యక్తం చేసిన వారు కొద్ది మందే. 27 శాతం సీఈవోలు మాత్రమే ఈ ఏడాది ఆదాయ వృద్ధి అవకాశాలపై నమ్మకంతో ఉన్నారు. 2009 తర్వాత అంతర్జాతీయంగా సీఈవోల్లో విశ్వాసం ఇంత కనిష్ట స్థాయికి చేరడం మళ్లీ ఇదే. గతేడాది ఇది 35 శాతంగా ఉంది. 
నిరాశావాదం తారస్థాయిలో...
అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో నిరాశావాదం రికార్డు స్థాయికి చేరిందని పీడబ్ల్యూసీ సర్వే పేర్కొంది. అంతర్జాతీయ జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని సగానికి పైగా సీఈవోలు చెప్పడం ఇదే మొదటి సారి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2018లో అంతర్జాతీయంగా సీఈవోల్లో ఆశావాదం రికార్డు స్థాయిలో ఉండగా, రెండేళ్లలో పరిస్థితులు ఎంతో మారిపోయినట్టు సర్వే స్పష్టం చేసింది.
ఆవిష్కరణలు కరవు...
తమ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వ్యవస్థలు సమర్థవంతమైనవని అంతర్జాతీయంగా మెజారిటీ సీఈవోలు అభిప్రాయపడుతున్నప్పటికీ.. తమ వృద్ధి అవకాశాలను, ఆదాయాన్ని పెంచే ఆవిష్కరణల పరంగా వారు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు యాక్సెంచర్‌ సంస్థ నిర్వహించిన మరో సర్వే స్పష్టం చేసింది. 
తారస్థాయికి ఆర్థిక అసమానతలు
భారత్‌ సహా పలు దేశాల్లో ఆర్థిక అసమానతలు గరిష్ట స్థాయికి చేరినట్టు అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్‌  డబ్ల్యూఈఎఫ్‌ వేదికగా తెలియజేసింది. స్థిరమైన, మరింత సమర్థవంతమైన అంతర్జాతీయ కార్పొరేటు పన్ను వ్యవస్థకు చర్యలు తీసుకోవాలని ఈ సంస్థ దేశాలను కోరింది. 2019లో 2,153 మంది బిలియనీర్లు 460 కోట్ల పేద వారి కంటే ఎక్కువ కలిగి ఉన్నారని ఈ సంస్థ పేర్కొంది.
ఒకప్పుడు అణుబాంబు.. ఇప్పుడు ఏఐ 
అణు బాంబు  అంటే ఒకప్పుడు ఎంతో భయం ఉండేదని, ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) అంటే భయం నెలకొందని చైనా కంపెనీ హువావే సీఈవో రెన్‌జెంగ్‌ఫీ వ్యాఖ్యానించారు. అయితే, టెక్నాలజీ అభివృద్ధి మంచికేనన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోలని కోరారు. డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో భాగంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పారదర్శక వాణిజ్యాన్నే భారత్‌ కోరుకుంటోంది: గోయల్‌
పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య భాగస్వామ్యాల కోసం భారత్‌ కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సులో స్పష్టం చేశారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల్లో వృద్ధికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహకారం మరింత విస్తృతం కావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్‌సీఈపీ) ప్రస్తుత రూపంలో ఉన్నది భారత్‌కు ఆమోదనీయం కాదన్నారు. ఈ ప్రాంతంలో చైనా, ఇతర దేశాలతో భారత్‌ వాణిజ్య లోటును కలిగి ఉందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని చెప్పారాయన. You may be interested

బీఓబీ, బీఓఐ, కెనరాబ్యాంక్‌లకు కొత్త చీఫ్‌లు

Wednesday 22nd January 2020

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), కెనరాబ్యాంక్‌లకు కొత్త ఎండీ అండ్‌ సీఈఓలు నియమితులయ్యారు. నియామకపు వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఇందుకు సంబంధించిన నియామకాలకు ఆమోదముద్ర వేసింది.  వేర్వేరుగా చూస్తే... బీఓబీ:- సంజయ్‌ చంద్ర ఎండీ అండ్‌ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం సంజయ్‌ చంద్ర బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఇన్‌చార్జ్‌గా

ఇంకా.. ఇంకా.. ఏం కావాలంటే!

Wednesday 22nd January 2020

పన్నుల భారం తగ్గించాలి... ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి ఎకానమీకి మరింత ఊతమిచ్చే చర్యలు కావాలి  రాబోయే బడ్జెట్‌పై అంచనాలు ఇవీ... నానాటికీ పడిపోతున్న జీడీపీ వృద్ధి.. కొండలా పెరిగిపోతున్న ద్రవ్య లోటు.. లేదు లేదని సర్ది చెప్పుకుంటున్నా వెంటాడుతున్న మందగమన భయాలు.. 45 ఏళ్ల గరిష్టానికి ఎగిసిన నిరుద్యోగిత రేటు..  ఒకటా రెండా.. మోదీ 2.0 రెండో రౌండులో పరిస్థితి మామూలుగా లేదు. సమస్యలన్నీ రౌండప్‌ చేసి కన్ఫ్యూజ్‌ చేస్తుంటే... ఏం చేయాలి.. ఎలా

Most from this category