పెరిగిన దేశీ విమాన ప్రయాణికుల రద్దీ
By Sakshi

ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య ఏడాది ప్రాతిపదికన మే నెలలో 2.96 శాతం పెరిగింది. విమానయాన సంస్థలు సంయుక్తంగా 1.22 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 1.85 కోట్లుగా ఉంది. డీజీసీఏ తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 49 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో ప్రథమ స్థానంలో ఉండగా.. స్పైస్‌జెట్ వాటా 13.1 శాతం నుంచి 14.8 శాతానికి చేరింది. ఎయిర్ ఇండియా (13.5 శాతం), గోఎయిర్ (11.1శాతం), ఎయిర్ఏషియా (6.3శాతం), విస్తారా (4.7శాతం) వాటాను నమోదుచేశాయి.
You may be interested
ఎన్డీటీవీ ప్రమోటర్ల నిషేధంపై శాట్ స్టే
Wednesday 19th June 2019సెప్టెంబర్ 16న తదుపరి విచారణ న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్లు క్యాపిటల్ మార్కెట్ లావాదేవీల్లో పాల్గొనకుండా నిషేధిస్తూ సెబీ ఇచ్చిన ఆదేశాలను శాట్ నిలిపేసింది. ఎన్డీటీవీ ప్రమోటర్లు- ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, హోల్డింగ్ సంస్థ ఆర్ఆర్ఆర్ఆర్ హోల్డింగ్ప్రైవేట్ లిమిటెడ్‌లు క్యాపిటల్ మార్కెట్ లావాదేవీల్లో రెండేళ్ల పాటు పాల్గొనకూడదంటూ సెబీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఎన్డీటీవీ ప్రమోటర్లు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను (శాట్) ఆశ్రయించారు.
వాట్సాప్ చాలెంజ్‌లో 5 స్టార్టప్‌ల ఎంపిక
Wednesday 19th June 2019హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని క్లిష్టమైన సమస్యలను టెక్నాలజీ ద్వారా పరిష్కరించేందుకు ఉద్దేశించిన వాట్సాప్ ఇండియా చాలెంజ్‌లో ఐదు స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. ఒక్కో స్టార్టప్‌కు రూ.35 లక్షలు (50 వేల డాలర్లు) ఫండింగ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎంపికైన స్టార్టప్స్.. డిజిటల్ హెల్త్‌కేర్ మెడ్కార్డ్స్, వర్చువల్ రియాలిటీ కంటెంట్ మెల్జో, వాట్స్అప్ ఆధారిత ఏఐ ఫ్లాట్‌ఫామ్ జావీస్, అగ్రిటెక్ గ్రామోఫోన్, రియల్ టైమ్ ఎలక్రిసిటీ లెవల్ మినీ ఆన్ ల్యాబ్స్.