News


ఏప్రిల్‌లో తగ్గిన విమాన ప్రయాణికుల రద్దీ

Thursday 30th May 2019
news_main1559203408.png-25999

  •  ఐదేళ్ల కనిష్టస్థాయికి క్షీణత

న్యూఢిల్లీ: గత నెల్లో దేశీ విమాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఆర్థిక సంక్షోభంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలు నిలిచిపోయిన కారణంగా రెవెన్యూ ప్యాసింజర్ కిలోమీటర్ (ఆర్‌పీకే) వృద్ధి సైతం ఏడాది ప్రాతిపదికన 0.5 శాతం తగ్గిపోయిందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తాజాగా వెల్లడించిన సమాచారం ద్వారా వెల్లడైంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మూత పడక ముందు వరకు రెండంకెల వృద్ధిరేటును నమోదుచేసిన భారత ఆర్‌పీకే.. 2014 జనవరి తరువాత తొలిసారిగా క్షీణించిందని ఐఏటీఏ వ్యాఖ్యానించింది. గడిచిన ఐదేళ్లలో సగటున 20 శాతం పెరిగిన ఈ రేటు.. డిసెంబర్‌లో నమోదైన 15 శాతం కంటే కూడా తగ్గిపోయిందని వివరించింది. మరోవైపు అంతర్జాతీయంగా ఏప్రిల్‌ ఆర్‌పీకే 4.3 శాతం వృద్ధి చెందింది. You may be interested

ఎఫ్‌ఐఐలు వచ్చేస్తున్నారు!

Thursday 30th May 2019

ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు  (ఎఫ్‌ఐఐలు) భారత మార్కెట్లోకి క్యూ కడుతున్నారు. సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, వ్యాపారనుకూల వాతావరణం, ఎకానమీ బలోపేతం చేయడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని ఇతర వర్ధమాన మార్కెట్ల కన్నా భారత్‌వైపే విదేశీ మదుపరులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి మే మొదటివరకు చురుగ్గా వ్యవహరించిన ఎఫ్‌ఐఐలు, ఆ తర్వాత ఎన్నికల ఫలితాల వరకు

ఎంటీఆర్‌ నుంచి రెండు కొత్త ఉత్పత్తులు

Thursday 30th May 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని రెండు ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు ఎంటీఆర్‌ ఫుడ్స్‌ సీఈఓ సంజయ్‌ శర్మ చెప్పారు. గుంటూరు మిరపకాయలతో చేసిన మసాలా కారం పొడి, 3 నిమిషాల్లో రెడీ అయ్యే సేమియా ఉప్మా రెడీమేడ్‌లను ఆయన బుధవారమిక్కడ మార్కెట్లోకి విడుదల చేశారు. రెండు ఉత్పత్తులపై రూ.30 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని, వచ్చే మూడేళ్లలో వీటితో రూ.150 కోట్ల అదనపు విక్రయాలను ఆశిస్తున్నామని

Most from this category