News


భారత్‌, రష్యా మధ్య బలమైన ఆర్థిక సహకారం

Thursday 11th July 2019
news_main1562825451.png-26980

  • నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ: భారత్‌, రష్యా తమ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా కలసి పనిచేస్తున్నాయని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. వ్యవసాయం, ఆగ్రో ప్రాసెసింగ్‌ విభాగాల్లో సహకారానికి అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన భారత్‌-రష్యా రెండో వ్యూహాత్మక ఆర్థిక చర్చల కార్యక్రమాన్ని (ఐఆర్‌ఎస్‌ఈడీ) ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. రష్యాతో తన బంధాన్ని భారత్‌ మరింత గుణాత్మకమైన, బలమైన ఆర్థిక సహకార స్థాయికి పెంచుకోవాలని, ఆలోచనలు పంచుకోవాలని భారత్‌ కోరుకుంటున్నట్టు చెప్పారు. సహకారాన్ని విస్తరించుకునేందుకు అవకాశం ఉన్న ఆరు ప్రధాన రంగాలపై ఐఆర్‌ఎస్‌ఈడీ దృష్టి సారించినట్టు చెప్పారు. వ్యవసాయ అభివృద్ధి, ఆగ్రో ప్రాసెసింగ్‌ రంగం, రవాణా సదుపాయాల అభివృద్ధి, టెక్నాలజీలు, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలకు మద్దతు, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, పర్యాటకం తదితర విభాగాలు ఇందులో ఉన్నట్టు చెప్పారు. 



You may be interested

ఆండ్రాయిడ్‌ ఫోన్లు జాగ్రత్త!!

Thursday 11th July 2019

2.5 కోట్ల ఫోన్లకు ఏజెంట్‌ స్మిత్‌ మాల్‌వేర్‌ వీటిల్లో 1.5 కోట్ల ఫోన్లు భారత్‌లోనే వెల్లడించిన చెక్‌పాయింట్‌ రీసెర్చ్‌ న్యూఢిల్లీ: ఏజెంట్‌ స్మిత్‌ అనే పేరున్న మొబైల్‌ మాల్‌వేర్‌ (హానికార వైరస్‌) ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లలోకి చొరబడినట్టు చెక్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థ తన పరిశోధనలో గుర్తించింది. వీటిల్లో 1.5 కోట్ల ఫోన్లు భారత్‌లోనే ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. యూజర్లకు తెలియకుండానే... వారి ఫోన్లలో ఉన్న మొబైల్‌ అప్లికేషన్ల స్థానంలో,

స్నేహం, బ్యాంకింగ్‌ వేర్వేరు

Thursday 11th July 2019

బ్యాంకింగ్‌ విధులకు స్నేహాన్ని దూరంగా పెట్టాలి సహచరులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆదిత్య పురి సూచన ముంబై: వ్యక్తిగత స్నేహాన్ని బ్యాంకింగ్‌ విధులకు దూరంగా ఉంచుకోవాలని తన సహచరులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ ఆదిత్య పురి సూచించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాకు గతంలో రుణ అభ్యర్థనను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘‘ఒక బ్యాంకర్‌ ఏ వ్యక్తితోనైనా కలసి కాఫీ తాగొచ్చు. ఆ తర్వాత

Most from this category