STOCKS

News


ఐదేళ్లలో 1,400 కోట్ల డాలర్ల పెట్టుబడులు

Tuesday 19th November 2019
Markets_main1574135000.png-29691

  • భారత రియల్టీలోకి విదేశీ నిధులు 
  • అనరాక్‌ సంస్థ వెల్లడి 

బెంగళూరు: భారత రియల్టీ రంగంలో నాలుగేళ్లలో 1,400 కోట్ల డాలర్ల విదేశీ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ)పెట్టుబడులు వచ్చాయి. 2015 నుంచి 2019, సెప్టెంబర్‌ కాలంలో ఈ పెట్టుబడులు వచ్చాయని రియల్‌ ఎస్టేట్‌ సర్వీసుల కంపెనీ అనరాక్‌ వెల్లడించింది. వీటిల్లో 60 శాతానికి పైగా నిధుల(880 కోట్ల డాలర్ల)ను వాణిజ్య రియల్టీ రంగం ఆకర్షించిందని పేర్కొంది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., 

  • రెసిడెన్షియల్‌ రంగంలో కేవలం 150 కోట్ల డాలర్ల పీఈ నిధులు మాత్రమే వచ్చాయి. రిటైల్‌ రంగంలో 170 కోట్ల డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. 
  • లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ రంగాల్లో  చెరో వంద డాలర్ల మేర పీఈ నిధులు వచ్చాయి. 
  • ఇక ఇదే కాలానికి దేశీయ పీఈ ఫండ్స్‌ 240 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. వీటిల్లో 71 శాతం పెట్టుబడులు హౌసింగ్‌ రంగంలోకి వచ్చాయి. 
  • రెసిడెన్షియల్‌ సెగ్మెంట్లో పెద్దగా రాబడులు రాకపోయినా, కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో మంచి రాబడులే వచ్చాయి. ఈ రంగంలో అద్దెలు పెరగడం, డిమాండ్‌ నిలకడగా ఉండటంతో విదేశీ పీఈ ఫండ్స్‌ కమర్షియల్‌ రియల్‌  ఎస్టేట్‌లో బాగా పెట్టుబడులు పెట్టాయి. 
  • పెట్టుబడులు పెట్టిన విదేశీ పీఈ ఫండ్స్‌లో మొదటి ఐదు స్థానాల్లో బ్లాక్‌స్టోన్‌, బ్రూక్‌ఫీల్డ్‌, జీఐసీ, అసెండాస్‌, గ్జాండర్‌ సంస్థలు నిలిచాయి. మొత్తం రియల్‌ ఎస్టేట్‌  రంగంలోకి వచ్చిన 1,400 కోట్ల డాలర్ల పెట్టుబడుల్లో ఈ ఐదు సంస్థల పెట్టుబడులే 75 శాతంగా ఉన్నాయి. 
  • దేశీయ ఫండ్స్‌ విషయంలో మోతిలాల్‌ ఓస్వాల్‌, హెచ్‌డీఎఫ్‌సీ వెంచర్‌, కోటక్‌ రియల్టీ, ఏఎస్‌కే గ్రూప్‌, ఆదిత్య బిర్లా పీఈలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. 



You may be interested

నిపుణుల కమిటీ ప్రకారం నిర్ణయం

Tuesday 19th November 2019

ఆర్‌బీఐ మిగులు నిధుల బదిలీ  లోక్‌సభకు వెల్లడించిన ఆర్థిక మంత్రి  న్యూఢిల్లీ: భవిష్యత్తులో ఆర్‌బీఐ మిగులు నిధుల బదిలీ.... నిపుణుల కమిటీ సూచనలను బట్టి ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆర్‌బీఐ నికర లాభం, ఇతర ఆర్థిక స్థితిగతులపై కూడా ఆర్‌బీఐ మిగులు  నిధుల బదిలీ అధారపడి ఉంటుందని వివరించారు. 1934 నాటి అర్‌బీఐ చట్టం సెక్షన్‌ 47 ప్రకారమే మిగులు నిధుల బదిలీ విధానం ఆధారపడి

11,900పైన నిఫ్టీ

Tuesday 19th November 2019

గత రెండు ట్రేడింగ్‌ సెషన్లుగా స్వల్ప నష్టాల్ని చవిచూసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 35 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,900 పాయింట్లపైన 11,919 పాయింట్ల వద్ద మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 170 పాయింట్ల లాభంతో 40,455 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

Most from this category