News


ఇంధన కంపెనీలకు నిధుల సమస్య లేదు

Saturday 3rd August 2019
news_main1564810997.png-27521

విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగానే భారత ఇంధనరంగం
పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఇంధన కంపెనీలు నిధుల సమీకరణ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. కొన్ని సౌర్వభౌమ ఫండ్స్‌, నార్వే పెన్షన్‌ ఫండ్‌ శిలాజ ఇంధన ఆధారిత ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్‌ చేయరాదని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ప్రకటనకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘అక్కడ ఎటువంటి సవాళ్లు లేవు. పెన్షన్‌ ఫండ్స్‌ ఇతరులు ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తితోనే ఉన్నారు’’ అని  శుక్రవారం బీఎన్‌ఈఎఫ్‌ సదస్సుకు హాజరైన సందర్భంగా మంత్రి ప్రకటన చేశారు. ఇంధన కంపెనీలు ముఖ్యంగా విదేశీ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించుకునే విషయంలో ఏవైనా సవాళ్లను ఎదుర్కొంటున్నాయా? అన్న ప్రశ్నకు మం‍త్రి స్పందించారు. ‘‘భారత ఇంధన రంగం విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉంది. సౌర్వభౌమ వెల్త్‌ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌, పశ్చిమ దేశాలు, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల దీర్ఘకాలిక వ్యూహాత్మక ఇన్వెస్టర్ల నుంచి ఈ రంగం నిధులను పొందుతూనే ఉంది’’ అని మంత్రి ప్రధాన్‌ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ 7 శాతం రేటుతో వృద్ధి చెందుతోందని, ఇది మరిన్ని నిధులను ఆకర్షించగలదన్నారు. చాలా కంపెనీలు విదేశీ బాండ్‌ మార్కెట్‌ ద్వారా నిధులను సమీకరించాయని, రానున్న కాలంలోనూ ఈ మార్గంలో నిధుల సమీకరణ మరింత పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
75 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు...
వచ్చే ఎనిమిదేళ్ల కాలంలో గ్యాస్‌ మౌలిక సదుపాయాల రంగంలోకి 75 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు మంత్రి తెలిపారు. బీఎస్‌-6 నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన తయారీకి భారత రిఫైనరీ కంపెనీలు రూ.30,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్టు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది చివరికి 3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని, సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, భారత్‌ అధిక వృద్ధి నిలబెట్టుకునేందుకు గాను సురక్షిత, చౌక, స్థిరమైన ఇంధన వనరులు అవసరమన్నారు. ప్రతీ ఇంధన వనరును అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దు నేపథ్యంలో, తమ నిర్ణయాలను తిరిగి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినట్టు మంత్రి తెలిపారు. You may be interested

ఫ్రంట్‌లైన్ స్టాక్‌లే బెటర్‌ ఛాయిస్‌!

Saturday 3rd August 2019

దీర్ఘకాలానికి బీమా, సిటీ గ్యాస్‌ డిస్ట్రీబ్యూషన్‌ సెక్టార్స్‌..  హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ కవలలు దిద్దుబాటుకు గురైతే వాటిని కొనుగోలు చేయవచ్చు ‘చాలా పెద్ద క్యాప్‌లు నెమ్మదిగా మిడ్‌క్యాప్‌లుగా మారుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఫ్రంట్‌లైన్ స్టాక్‌లకు కట్టుబడి ఉండడమే ఉత్తమం. మిడ్‌ క్యాప్‌లపై బుల్లిష్‌గా ఉంటే వీటిపై దృష్ఠి పెట్టవచ్చు.’ అని సెంట్రమ్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , రీసెర్చ్ హెడ్ జగన్నాధం తునుగుంట్ల ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.

ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలతో తిరుపతికి మరింత ప్రగతి

Saturday 3rd August 2019

బిజినెస్‌ సెంటర్‌ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మేకపాటి యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ప్రత్యేక తర్ఫీదు రేణిగుంట (చిత్తూరు జిల్లా) : ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బిజినెస్‌ సెంటర్‌ నూతన భవనాన్ని ఆయన

Most from this category