News


విదేశీ ఉత్పత్తులు మరింత ప్రియం

Monday 27th January 2020
news_main1580117346.png-31239

బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపు..?
 ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే  వార్షిక బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఇతర దేశాల నుంచిద మన దేశానికి దిగుమతి అయ్యే 50పైగా వస్తువులపై దిగుమతి సుంకం పెరగనుంది.56 బిలియన్‌ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, రసాయనాలు, హస్తకళలు వంటి దిగుమతులు ఈ జాబితాలో ఉన్నాయి. మొబైల్‌ చార్జర్స్‌, ఇండస్ట్రీయల్‌ కెమికల్స్‌, ల్యాంప్స్‌, చెక్కతో తయారు చేసిన గృహోపకరణాలు, క్యాండిల్స్‌, ఆభరణాలు, హస్తకళలతో రూపొందిన వస్తువులపై అధికంగా సుంకం విధించే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో దిగుమతి అవుతున్న వస్తువులపై 5నుంచి 10 శాతం సుంకాన్ని విధించేందుకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.  సుంకాలు పెంపు ద్వారా విదేశాల నుంచే వచ్చే ఉత్పత్తుల దిగుమతులు కొంత మేర తగ్గినా, దేశీయ ఉత్పత్తి దారులకు మంచి ఆదరణ లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.ఇప్పుడిప్పుడే తన వ్యాపారాన్ని ఇండియాలో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోన్న ఐకియాతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ కంపెనీలకు దిగుమతి సుంకం పెంపు  ఇబ్బంది కలిగించే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



You may be interested

ఈ చిన్న షేర్లు.. ఫండ్స్‌ ఫేవరెట్స్‌

Monday 27th January 2020

క్యూ3లో మ్యూచువల్‌ ఫండ్స్‌ షాపింగ్‌ జాబితాలో నారాయణ, ఎఫ్‌డీసీ, ఇప్కా మిధానీ, జూబిలెంట్‌ ఫుడ్‌, ఫీనిక్స్‌ మిల్స్‌ ఇటీవల ర్యాలీలో ఈ స్మాల్‌ క్యాప్స్‌ జోరు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో క్వార్టర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు మక్కువ చూపిన కంపెనీలు గత కొంతకాలంగా జోరు చూపుతున్నాయి. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఫండ్‌ హకౌస్‌లు కనీసం 1 శాతం వాటాను సొంతం చేసుకున్న కొన్ని చిన్న, మధ్యతరహా కంపెనీల కౌంటర్లు ఇదే కాలంలో ర్యాలీ బాటలో సాగుతూ వచ్చాయి.

ప్రపంచమార్కెట్లలో ‘‘కరోనా’’ కలవరం..!

Monday 27th January 2020

చైనాతో పాటు ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్‌ వ్యాధి భయాలు ఇప్పుడు ఆర్థిక మార్కెట్లను కలవరపెడుతోంది. చైనాలో సంభవించిన ఈ అనూహ్య సంఘటనతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై మరోసారి ఆందోళనలు రేకెత్తాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో గతవారంలో ఆసియాలో ప్రధాన మార్కెట్లైన హాంగ్‌కాంగ్‌ 2శాతం, షాంఘై 3శాతం, షాంగ్‌జెన్‌ 5శాతం నష్టాలను చవిచూశాయి. ఆర్థిక వృద్ధి మందగమన బెంగతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 3శాతానికి

Most from this category