News


స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అమెరికాను దాటేసిన ఇండియా

Saturday 25th January 2020
news_main1579947441.png-31206

షియోమీ నంబర్‌ 1
వివో నంబర్‌ 2

భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం రోజురోజుకీ పెరుగుతుండడంతో ..అమ్మకాలు భారీస్థాయిలో జరుగుతున్నాయి. దీంతో ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌గా అవతరించింది. ఇప్పటిదాక చైనా, అమెరికాలు మొదటి రెండుస్థానాల్లో ఉండగా భారత్‌ అమెరికాను వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచింది. భారత మార్కెట్‌లో చైనా కంపెనీ ఫోన్ల హవా కొనసాగుతుండడమే ఇందుకు కారణమని మార్కెట్‌ మానిటర్‌ సర్వీస్‌ వెల్లడించింది. 2019 సంవత్సరంలో 7 శాతం వృద్ధితో భారత మార్కెట్లోకి  15.8 కోట్ల చైనా ఫోన్లు దిగుమతి అయ్యాయి. 

భారత మార్కెట్‌లో రెండోస్థానంలో వివో
 ప్రముఖ  చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివో భారత్‌ మార్కెట్‌లో రెండోస్థానంలో నిలిచింది. భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో అనేక కంపెనీలు పోటీ పడుతుంటాయి. వాటిల్లో వివో కూడా ఒకటి. 2019 నాల్గో త్రైమాసికంలో  భారత మార్కెట్‌లో  షేర్‌ వాటాను 21 శాతం కైవసం చేసుకుని  తొలిసారి రెండోస్థానాన్ని దక్కించుకుంది. దీంతో 19శాతం వాటాతో  రెండో స్థానంలో కొనసాగుతున్న శామ్‌సంగ్‌ మూడో స్థానానికి పరిమితమైంది. కాగా 27 శాతం వాటాతో షియోమి మొదటి స్థానానికి చేరింది. ఒప్పో(12శాతం),రియల్‌మీ (8శాతం)లు తొలి ఐదుస్థానాల్లో వరుసగా చోటు దక్కించుకున్నాయి.

 



You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం జూమ్‌

Saturday 25th January 2020

క్యూ3లో 158 శాతం అప్‌ తగ్గిన ప్రొవిజన్లు, పెరిగిన ఇతర ఆదాయం నీరసించిన మొండిబకాయిలు ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 158 శాతం దూసుకెళ్లి రూ. 4,146 కోట్లను తాకింది. ఇందుకు ప్రొవిజన్లు తగ్గడం, ఇతర ఆదాయం, రుణ నాణ్యత మెరుగుపడటం వంటి అంశాలు సహకరించాయి. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 1605 కోట్ల లాభం మాత్రమే ఆర్జించింది.

ఈ వారంలో ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ, బడ్జెట్‌.. తస్మాత్‌ జాగ్రత్త!

Saturday 25th January 2020

నిపుణుల సూచన రాబోయే వారంలో జనవరి సీరిస్‌ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ, బడ్జెట్‌ సెషన్‌ ఉన్నందున మార్కెట్లో తీవ్ర ఒడిదుడకులుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈవారం సూచీలు నెగిటివ్‌గా ఆరంభమైనా, చివరి రెండు సెషన్లలో లాభాలను ఆర్జించింది. కొన్ని రోజులుగా నిఫ్టీ దాదాపు 300- 400 రేంజ్‌లో కదలికలు చూపింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి బ్రేకవుట్‌ కానీ, బ్రేక్‌డౌన్‌కానీ చూపలేదు. నిఫ్టీ కీలక ట్రెండ్‌లైన్‌

Most from this category