భారత్కు రూ. 90వేల కోట్ల నష్టం
By Sakshi

న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల వాణిజ్య లావాదేవీల్లో తప్పుడు ఇన్వాయిస్ల కారణంగా 2016లో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. పన్ను ఆదాయాలపరంగా వాటిల్లిన ఈ నష్టం సుమారు రూ. 90,000 కోట్లు (13 బిలియన్ డాలర్లు) ఉంటుందని అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్ఐ) సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఇది 2016లో వసూలైన మొత్తం ఆదాయంలో దాదాపు 5.5 శాతమని పేర్కొంది. ప్రధానంగా చైనా నుంచి జరిగిన దిగుమతుల్లో ఇలాంటి ధోరణులు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. 2016లో భారత ద్వైపాక్షిక వాణిజ్యంపై ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన గణాంకాల ఆధారంగా జీఎఫ్ఐ ఈ నివేదిక రూపొందించింది. ఎగుమతులపరమైన తప్పుడు ఇన్వాయిసింగ్ వల్ల 4 బిలియన్ డాలర్లు, దిగుమతుల బిల్లింగ్ లోపాల కారణంగా 9 బిలియన్ డాలర్ల మేర పన్ను ఆదాయానికి గండిపడింది.
"వాణిజ్యంలో తప్పుడు ఇన్వాయిసింగ్ బెడద భారత్తో పాటు అన్ని దేశాలకూ ఉంది. నగదును విదేశాలకు మళ్లించే ఉద్దేశంతో దిగుమతులపై అసలు ధర కన్నా ఎక్కువ బిల్లింగ్ చూపే అవకాశాలు ఉన్నాయి. లేదా కస్టమ్స్ సుంకాల్లాంటివి ఎగవేసేందుకు ఇన్వాయిస్ను తక్కువ చూపించవచ్చు" అని జీఎఫ్ఐ పేర్కొంది. అలాగే, డబ్బును విదేశాలకు మళ్లించేందుకు ఎగుమతుల బిల్లింగ్ను తక్కువ చేసి చూపించడం లేదా విలువ ఆధారిత పన్నులు లాంటివి రీక్లెయిమ్ చేసుకునేందుకు ఎక్కువ చేసి చూపించడం వంటివి కూడా జరుగుతుంటాయని వివరించింది. ఏ రకంగా చూసినా.. అంతిమంగా ప్రభుత్వానికి దఖలుపడాల్సిన పన్ను ఆదాయాలు దక్కకుండా పోతున్నాయని జీఎఫ్ఐ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యాచరణ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సిఫార్సు చేసినట్లుగా మనీ లాండరింగ్ నిరోధక చర్యలు అమలు చేయడంపై భారత్ దృష్టి పెట్టాలని సూచించింది.
You may be interested
పారదర్శక విధానాలు అమలు చేయండి
Friday 7th June 2019తయారీ రంగ వృద్ధిపై రాష్ట్రాలకు కేంద్ర మంత్రి గోయల్ సూచన సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తయారీ రంగం వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి తావులేని పారదర్శక విధానాలు అమలు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సూచించారు. పరిశ్రమ ప్రతినిధులు, దేశీ తయారీ రంగ ఎగుమతుల సంస్థలు కేంద్రం ఇచ్చే గ్రాంట్స్, సబ్సీడీల మీద ఆధారపడుకుండా స్వీయ వృద్ధిపై దృష్టి సారించాలన్నారు. దేశంలో తయారీ రంగం వృద్ధి,
వాహన బీమా ప్రీమియం ప్రియం
Friday 7th June 201921 శాతం దాకా పెంపు జూన్ 16 నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనాల బీమా మరింత భారం చేసే నిబంధనలు జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ ఆదేశాల ప్రకారం వివిధ రకాల వాహనాలకు తప్పనిసరైన థర్డ్ పార్టీ (టీపీ) మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం 21 శాతం దాకా పెరగనుంది. సాదారణంగా టీపీ ఇన్సూరెన్స్ కవర్ రేట్లు ఏటా ఏప్రిల్ 1న