News


మొబైల్ నెట్‌లో అట్టడుగున భారత్‌

Tuesday 5th November 2019
news_main1572925589.png-29350

  • బ్రాడ్‌బ్యాండ్‌లో కొంత మెరుగైన ర్యాంకు
  • ఊక్లా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌, నేపాల్‌ కన్నా భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను విశ్లేషించే ఊక్లా సంస్థ సెప్టెంబర్‌ నెలకు గాను నిర్వహించిన సర్వేలో భారత్‌ 128వ ర్యాంకులో నిల్చింది, శ్రీలంక 81వ ర్యాంకు, పాకిస్తాన్‌ 112వ స్థానం, నేపాల్‌ 119వ ర్యాంకులు దక్కించుకున్నాయి. అయితే, ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో మాత్రం ఈ దేశాలన్నింటికన్నా అత్యంత మెరుగ్గా భారత్ 72వ స్థానంలో నిల్చింది. అంతర్జాతీయంగా సగటు డౌన్‌లోడ్‌, అప్‌లోడ్ స్పీడ్‌లో దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉంది. మరోవైపు, ద్వితీయ, తృతీయ త్రైమాసికాల్లో భారత్‌లో 11 పెద్ద నగరాల్లో ఎయిర్‌టెల్‌ అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్ ఆపరేటరుగా అగ్రస్థానంలో నిల్చింది. ఒక చోట జియోతో సమానంగా ఉంది. 4జీ నెట్‌వర్క్ లభ్యత విషయంలో జియో అగ్రస్థానంలోను, ఎయిర్‌టెల్‌ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. 



You may be interested

వృద్ధి 5.8 శాతానికి పడిపోవచ్చు

Tuesday 5th November 2019

2019-20పై బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్‌ అంచనాల సవరణ ముంబై: ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నా కానీ, పండుగల సమయంలో డిమాండ్‌ పుంజుకోకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 5.8 శాతానికి తగ్గిపోవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ (బోఫాఎంఎల్‌) అంచనా వేసింది. వచ్చే ఫిబ్రవరిలో జరిగే సమీక్షలో ఆర్‌బీఐ ఎంపీసీ కీలక రేట్లను 0.15 శాతం మేర తగ్గిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి

బీఎస్‌ఎన్‌ఎల్‌పై దివాలా పిటీషన్లు!!

Tuesday 5th November 2019

బాకీలు రాబట్టుకునేందుకు వెండార్ల యోచన 19న నిరసన ప్రదర్శన న్యూఢిల్లీ: నష్టాలు, రుణాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెల్కోలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఓవైపు ప్యాకేజీ ప్రకటించగా.. మరోవైపు.. వాటి నుంచి వేల కోట్ల బాకీలు రాబట్టుకునేందుకు వెండార్లు సిద్ధమవుతున్నారు. బాకీలు వసూలు కాని పక్షంలో ఆ రెండు సంస్థలపై దివాలా పిటీషన్లు వేయాలని వివిధ యంత్ర పరికరాలు సరఫరా చేసిన వెండార్లు యోచిస్తున్నారు. ఈ బాకీలు సుమారు రూ. 20,000

Most from this category