STOCKS

News


వ్యాపారానికి భారత్‌ భేష్‌..

Friday 25th October 2019
news_main1571974325.png-29123

  • మరింత మెరుగుపడిన మన దేశ ర్యాంక్‌
  • వ్యాపార సులభతరంలో భారత్‌కు 63వ స్థానం
  • ప్రపంచ బ్యాంక్‌ తాజా జాబితా వెల్లడి
  • టాప్‌ 10 మెరుగైన దేశాల్లో స్థానం కొనసాగింపు

వాషింగ్టన్: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల జాబితాలో భారత ర్యాంక్‌ మరింత మెరుగుపడింది. ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాదిలో 77వ స్థానానికి చేరి సంచలం సృష్టించిన భారత్‌.. ఈ సారి ఏకంగా మరో 14 మెట్లు పైకెక్కింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆర్‌బీఐ, ఐఎంఎఫ్‌, పలు రేటింగ్‌ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటులో కోతను విధించిన ప్రస్తుత తరుణంలో భారత ర్యాంక్‌ మరింత మెరుగుపడడం విశేషం కాగా.. వరుసగా మూడో సారి కూడా టాప్‌ 10 మెరుగైన దేశాల్లో స్థానం కొనసాగడం మరో విశేషంగా నిలిచింది. ఈ విధమైన రికార్డులను నెలకొల్పడం భారత్‌కే సాధ్యపడిందని వరల్డ్‌ బ్యాంక్‌ డైరెక్టర్ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ సిమియన్ జంకోవ్ కొనియాడారు. వచ్చే రెండేళ్లలో టాప్‌ 50 వ్యాపార సులభతర దేశాల జాబితాలోకి చేరలన్న భారత్‌ లక్ష్యానికి అనుకూలంగా ఇక్కడి వాతావరణం మారుతోందని వ్యాఖ్యానించారు.

స్పైస్‌ సూపర్‌...
భారత్‌లో కంపెనీలను సునాయసంగా ప్రారంభించడం కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. స్పైస్‌ (సరళీకృత ఎలక్ట్రానిక్‌ నమోదు) పేరిట నూతన ఒరవడిని సృష్టించింది. ఇదే సమయంలో ఫైలింగ్‌ రుసుమును రద్దు చేయడం వంటి వ్యాపార సానుకూల నిర్ణయాలను తీసుకుంది. ఢిల్లీలో నిర్మాణ అనుమతులు పొందేందుకు సమయం, ఖర్చులను గణనీయంగా తగ్గించడం.. పరిపాలన పరమైన సంస్కరణలు చేపట్టడం వంటి కీలక అంశాలు భారత ర్యాంకును మరింత పైకి చేర్చాయని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది.  



You may be interested

ఎన్‌ఎస్‌ఈలో కొత్త సూచీ

Friday 25th October 2019

న్యూఢిల్లీ: మిడ్‌క్యాప్ కంపెనీలకు సంబంధించి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తాజాగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్‌ను ప్రారంభించింది. గడిచిన అయిదేళ్లలో ఆయా సంస్థల లాభదాయకత, రుణభారం, ఆదాయా వృద్ధి అవకాశాలు తదితర అంశాల ప్రాతిపదికన నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీలోని టాప్ 50 కంపెనీలను ఈ స్మార్ట్‌ బీటా ఇండెక్స్‌లో చేర్చుతామని ఎన్‌ఎస్ఈ ఇండిసెస్‌ సంస్థ వెల్లడించింది. ఈ సూచీకి 2005 ఏప్రిల్ 1 బేస్‌

ఐటీసీ లాభం రూ.4,173 కోట్లు

Friday 25th October 2019

37 శాతం వృద్ధి  6 శాతం వృద్ధితో రూ.12,759 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.4,174 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.3,045 కోట్లు)తో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. పేపర్‌ బోర్డ్స్‌, హోటళ్లు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఇతర వ్యాపారాల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో

Most from this category