News


‘వివాద్‌ సే విశ్వాస్‌’ కింద ఇక డిక్లరేషన్లు!

Friday 20th March 2020
news_main1584677072.png-32587

స్కీమ్‌ను నోటిఫై చేసిన
ఐటీ డైరెక్టరేట్‌ (సిస్టమ్స్‌) 

వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద డిక్లరేషన్‌ సమర్పించడానికి సంబంధించి ఆన్‌లైన్‌ విధివిధానాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ (సిస్టమ్స్‌) గురువారం నోటిఫై చేసింది. దీనివల్ల ఈ పథకం ద్వారా ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కారాన్ని కోరుకునే పన్ను చెల్లింపుదారులు ఐటీ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌పై తమ డిక్లరేషన్లను సమర్పించడానికి వీలు కలుగుతుంది. అంతక్రితం ప్రభుత్వం పథకానికి సంబంధించి నియమ నిబంధనలను, పథకం కింద ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాల్సిన  ఫామ్స్‌ 1,2,3,4,5 కూడా నోటిఫై చేసింది. 2020-21 బడ్జెట్‌లో ఈ ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్‌ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్‌ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్‌ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది.



You may be interested

డిజిటల్‌ చెల్లింపుల చార్జీలను ఎత్తివేసిన బీఓబీ

Friday 20th March 2020

కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా దిగ్భందనం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తమ వంతు పాత్రగా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వెల్లడించింది. ఇందులో భాగంగా ‘స్టే సేఫ్‌, బ్యాంక్‌ సేఫ్‌’ పేరిట స్కీంను గురువారం ప్రకటించింది. కస్టమర్లు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌ చెల్లింపులపై మూడు నెలలపాటు చార్జీలను ఎత్తివేసినట్లు వివరించింది. 

టీవీఎస్ సీఎండీగా వేణు శ్రీనివాసన్‌

Friday 20th March 2020

 ప్రస్తుతం టీవీఎస్ మోటార్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఉన్న వేణు శ్రీనివాసన్‌ను పున:నియమించేందుకు కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. దీంతో ఈయన సంస్థ సీఎండీగా మరో 5 ఏళ్లు కొనసాగనున్నారు. షేర్‌ హోల్డర్లు ఈయన్ను తిరిగి నియామించేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి వచ్చే 5 ఏళ్లు సీఎండీ పదవిలో ఉండనున్నారని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో

Most from this category