News


భారత్‌కు ఆ సత్తా ఉంది..

Monday 18th November 2019
news_main1574050283.png-29663

వేగంగా వృద్ధి సాధనపై ఐటీ దిగ్గజం బిల్ గేట్స్‌ వ్యాఖ్యలు
ఆధార్‌, యూపీఐ విధానాలపై ప్రశంసలు

న్యూఢిల్లీ: రాబోయే దశాబ్ద కాలంలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించే సత్తా భారత్‌కు ఉందని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. దీనితో పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బైటపడగలరని, విద్య.. వైద్యంపై ప్రభుత్వం మరింత భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉంటుందని ఆయన చెప్పారు. ఆధార్, యూపీఐ చెల్లింపుల వ్యవస్థలు, భారతీయ ఆర్థిక సేవలు.. ఫార్మా రంగాల పనితీరును గేట్స్ ప్రశంసించారు. "సమీప భవిష్యత్తు గురించైతే చెప్పలేను గానీ.. వచ్చే దశాబ్ద కాలంలో మాత్రం భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భారత్‌కు కచ్చితంగా ఆ సత్తా ఉంది" అని గేట్స్ పేర్కొన్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాల పర్యవేక్షణ కోసం మూడు రోజుల పాటు భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా బిల్ గేట్స్‌ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఆర్థిక మందగమన పరిస్థితులతో భారత వృద్ధి అంచనాలను రేటింగ్ ఏజెన్సీలు కుదిస్తున్న నేపథ్యంలో బిల్ గేట్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
    భారత్‌లో విజయవంతంగా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను మిగతా దేశాల్లోనూ ఎలా అమలు చేయొచ్చన్న అంశాలపై నందన్ నీలేకని వంటి దిగ్గజాలతో తాము కలిసి పనిచేస్తున్నామని గేట్స్ చెప్పారు. భారత్ అనగానే సాధారణంగా ఐటీ సేవల రంగమే గుర్తొస్తుందని.. కానీ సీరమ్‌, భారత్‌ బయోటెక్‌, బయో-ఈ వంటి పలు ఔషధ రంగ సంస్థలు చాలా గొప్ప సేవలు అందిస్తున్నాయన్నది కూడా తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. 



You may be interested

బలపడిన రూపీ

Monday 18th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం సెషన్‌లో 11 పైసలు బలపడి 71.68 వద్ద ప్రారంభమైంది. కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో పాటు, చమురు ధరలు తగ్గడంతో శుక్రవారం సెషన్‌లో(నవంబర్‌ 15) రూపీ డాలర్‌ మారకంలో 18 పైసలు బలపడి 71.79 వద్ద ముగిసింది. నవంబర్‌ 15 తో ముగిసిన వారంలో రూపీ డాలర్‌ మారకంలో ఏకంగా 50 పైసలు నష్టపోయి 71.79 స్థాయికి చేరుకుంది.

ఆర్‌కామ్‌ వేలం నుంచి తప్పుకున్న ఎయిర్‌టెల్‌

Monday 18th November 2019

రుణదాతల కమిటీ తీరుపై అభ్యంతరాలు న్యూఢిల్లీ: దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) ఆస్తుల కొనుగోలు రేసు నుంచి టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తప్పుకుంది. వేలానికి సంబంధించి బిడ్డింగ్‌ గడువు పెంచాలంటూ తాము కోరితే పట్టించుకోని రుణదాతల కమిటీ (సీవోసీ), మరో పోటీ సంస్థ (రిలయన్స్ జియో) అభ్యర్ధిస్తే మాత్రం సానుకూల నిర్ణయం తీసుకుందంటూ ఎయిర్‌టెల్ ఆక్షేపించింది. రుణదాతల కమిటీ తీరు పూర్తిగా అసమంజసమని, పక్షపాతంతో కూడుకున్నదని వ్యాఖ్యానించింది. రిలయన్స్

Most from this category