STOCKS

News


అమెరికాతో వాణిజ్య వివాదాల్లేవు

Wednesday 16th October 2019
Markets_main1571198954.png-28915

  • ఉన్నది కొన్ని అభిప్రాయ భేదాలే
  • ఱైల్వేలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులు
  • కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: అమెరికాతో భారత్‌కు ఎటువంటి వాణిజ్య వివాదాల్లేవని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఉన్నది కేవలం కొన్ని అభిప్రాయ భేదాలేనన్నారు. ఇరు దేశాలు గణనీయ స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సామర్థ్యాన్ని కలిగి ఉ‍న్నాయని చెప్పారు. భారత ఇంధన సదస్సులో మంత్రివర్గ ప్యానెల్‌ చర్చ సందర్భంగా గోయల్‌ మాట్లాడారు. భారత్‌కు ప్రాధాన్య హోదాను (జీఎస్‌పీ)ను అమెరికా రద్దు చేయడంతోపాటు, మన దేశం నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్‌ దిగుమతులపై సుంకాలు మోపిన విషయం గమనార్హం. దీనికి ప్రతిగా అమెరికా దిగుమతులు (యాపిల్స్‌, వాల్‌నట్స్‌, బాదం తదితర) పైనా మన దేశం టారిఫ్‌లు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు ఓ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘‘మన దేశానికి జీఎస్‌పీ హోదాను అమెరికా రద్దు చేయడం అన్నది కొందరికి వివాదంగానే కనిపించొచ్చు. కానీ ఇది అమెరికా వాణిజ్య మంత్రితో చర్చలకు వీలు కల్పించింది. అద్భుతమైన చర్చలు చోటు చేసుకున్నాయి. గ్యాస్‌, న్యూక్లియర్‌ ఎనర్జీ విభాగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అమెరికా, భారత్‌ మద్య బలమైన బంధం ఉంది. ఈ బంధం క్రమానుగతంగా పెరగడం కాకుండా ఒక్కసారిగా మరింత బలపడాలని కోరుకుంటున్నాం. అర ట్రిలియన్‌ డాలర్ల వాణిజ్య లక్ష్యం పెట్టుకున్నాం’’ అని మంత్రి గోయల్‌ పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఆర్‌కే సింగ్‌, ధర్మేంద్ర ‍ప్రధాన్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. 
పెట్టుబడులకు మంచి తరుణం...
ఇటీవలి ఆర్థిక మందగమనం అన్నది సైక్లికల్‌గా నిర్మాణాత్మకమైన సర్దుబాటేనని, భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి తరుణమని గోయల్‌ పేర్కొన్నారు. ‘‘అపార అవకాశాతో కూడిన భారత ఆర్థిక వ్యవస్థ ఈ తరహా మందగమనాలతో సంబంధం లేకుండా మంచి పనితీరు చూపించగలదు. ప్రపంచంలో ఇతర ఆర్థిక వ్యవస్థ మాదిరే భారత్‌ ఆర్థిక వ్యవస్థ కూడా. ఇటీవలి కాలంలో సవాళ్లు పెరిగాయి. గత రెండు త్రైమాసికాలకు ముందు నాలుగైదేళ్ల పాటు మంచి పనితీరు చూపించాం’’ అని గోయల్‌ వివరించారు. గత ఐదేళ్ల కాలంలో అంతకుముందు ఐదేళ్ల కాలంతో పోలిస్తే భారత్‌ రెట్టింపు పెట్టుబడులను రాబట్టిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ రైల్వే రానున్న 12 ఏళ్ల కాంలో 700 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులపై (రూ.50 లక్షల కోట్లు) దృష్టి సారిస్తుందన్నారు. తద్వారా రవాణా వ్యవయాలను తగ్గిస్తామని, ఇది ఎన్నో రంగాలపై భారాన్ని తగ్గిస్తుందని చెప్పారు. 
175 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకుంటాం: ఆర్‌కే సింగ్‌
పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2022 నాటికి 175 గిగావాట్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. ‘‘నేడు 83 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. మరో 29 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు ప్రక్రియలో ఉంది. దీంతో 112 గిగావాట్లు అవుతుంది. 30 గిగావాట్ల కోసం బిడ్ల దశలో ఉంది’’అని మంత్రి వివరించారు. 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్న ప్రధాని లక్ష్యాన్ని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. 
పెరగనున్న ఇంధన డిమాండ్‌...
రానున్న దశాబ్దంలో ఇంధన డిమాండ్‌ను శాసించే కీలక దేశంగా భారత్‌ అవతరించనున్నప్పటికీ, ఇంధన పరివర్తన విషయంలో భారత్‌ తనదైన కార్యాచరణ అనుసరిస్తుందని పెట్రోలియం మంద్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. ఇంధన సదస్సులో జరిగిన చర్చలో ప్రధాన్‌ కూడా పాల్గొన్నారు. ‘‘తలసరి ఇంధన వినియోగం విషయంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో మూడో వంతుగానే ఉంది. కనుక ఇంధనం విషయంలో అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే అందుబాటు ధరలకే, స్థిరమైన ఇంధనం అందరికీ అందుబాటులో ఉండాలి. ఇందు కోసం అన్ని ఇంధన వనరులు సమ్మిళితంగా ఉండాలి’’ అని మంత్రి అన్నారు. You may be interested

స్వల్ప లాభాల్లో క్రూడ్‌

Wednesday 16th October 2019

   బ్రెక్సిట్‌ ఒప్పందం సజావుగా సాగుతుందనే అంచనాలతోపాటు, ఒపెక్‌(చమురు ఎగుమతి, దిగుమతి దేశాలు), ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తికి మరింత కోత విధించేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో చమురు ధరలు బుధవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా కదులుతున్నాయి. కానీ అంతర్జాతీయ ఆర్థిక మందగమనం వలన ఈ లాభాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఉదయం 9.47 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.29 శాతం లాభపడి బారెల్‌ 58.91 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.25

రెండవ నెలలోనూ ఎగుమతులు మైనస్‌

Wednesday 16th October 2019

సెప్టెంబర్‌లో -6.57 శాతం క్షీణత న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు వరుసగా రెండవ నెల- సెప్టెంబర్‌లోనూ నిరాశను మిగిల్చాయి. వృద్ధిలేకపోగా -6.57 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో 26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  ఇక దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ, దిగుమతులూ క్షీణతలో కొనసాగుతున్నాయి. - 13.85 శాతం క్షీణతతో 36.89 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు- దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 10.89 బిలియన్‌ డాలర్లుగా

Most from this category