కోల్ ఇండియాను విడగొడితే మంచిదే...!
By Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ప్రఖ్యాతిగాంచిన కోల్ ఇండియాను పలు కంపెనీలుగా వేరు చేసి లిస్ట్ చేయాలన్న ప్రతిపాదనను మోదీ సర్కారు పరిశీలిస్తోంది. తద్వారా మూడు లక్ష్యాలను నెరవేర్చుకునే ఆలోచనతో ఉంది. ఒకటి పోటీ పెంచడం, రెండు ఉత్పత్తి పెంచడం, మూడు నిధులు సమీకరించడం. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) ఇప్పటికే కోల్ ఇండియాకు చెందిన నాలుగు అతిపెద్ద యూనిట్లు, ఉత్పత్తి విభాగాన్ని గుర్తించి వీటికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేయగా, దీనిని ఆర్థిక శాఖతోపాటు కోల్ ఇండియా అధ్యయనం చేస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఇది ప్రారంభ దశలో ఉందని, కార్యరూపం దాల్చేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల విక్రయం, ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా రూ1.05 లక్షల కోట్లను సమీకరించాలన్న లక్ష్యాన్ని బడ్జెట్లో నిర్దేశించుకున్న విషయం గమనార్హం. కోల్ ఇండియాను పలు కంపెనీలుగా విభజించడం వల్ల దేశీయ బొగ్గు మార్కెట్లో మంచి పోటీకి దారితీస్తుందని, తద్వారా కార్పొరేట్ గవర్నెన్స్ కూడా మెరుగుపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు కోల్ ఇండియా అధికార ప్రతినిధి మాత్రం ఆసక్తి చూపించలేదు.
నత్త నడకే...
కోల్ ఇండియాకు చెందిన మహానది కోల్ ఫీల్డ్స్, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ విభాగాలు సంస్థ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 75 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. కానీ, అదే సమయంలో మొత్తం ఉద్యోగుల్లో ఈ నాలుగు విభాగాలు వినియోగించుకున్న మానవ వనరులు సగానికి లోపే ఉన్నాయి. కోల్ ఇండియా నుంచి విభజించాలనుకుంటున్న ఐదో యూనిట్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్. బొగ్గు నిక్షేపాలు కావాల్సినన్ని ఉన్నప్పటికీ, దేశీయ అవసరాలకు తగ్గ బొగ్గును ఉత్పత్తి చేసి కోల్ ఇండియా అందించలేకపోతోంది. 2018-19 సంవత్సరంలో ఈ సంస్థ 607 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి ఇది 22 శాతం తక్కువ. ప్రభుత్వం పలు విడతలుగా లక్ష్యాన్ని తక్కువకు సవరించినా కానీ, నిర్ణీత లక్ష్యానికి ఉత్పత్తి తక్కువగానే ఉంది. దేశీయ అవసరాల్లో 83 శాతాన్ని కోల్ ఇండియా సమకూరుస్తోంది. నిజానికి 2017లోనే కోల్ ఇండియాను పలు యూనిట్లుగా విడగొట్టి, ఒకదానితో మరొకటి పోటీ పడేలా చేయాలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సూచించింది. కానీ, అప్పటి బొగ్గు మంత్రి పీయూష్ గోయల్ దాన్ని తోసిపుచ్చారు.
You may be interested
మైండ్ ట్రీ లాభం 41 శాతం డౌన్
Thursday 18th July 201912 శాతం పెరిగిన ఆదాయం అనిశ్చితిలోనూ నిలకడ ఫలితాలు సాధించాం మైండ్‌ట్రీ సీఈఓ రోస్టో రావణన్ వెల్లడి న్యూఢిల్లీ: మద్య స్థాయి ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 41 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.158 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.93 కోట్లకు తగ్గిందని మైండ్‌ట్రీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 53 శాతం తగ్గిందని వివరించింది. అయితే ప్రస్తుత
అన్నై ఇన్ఫ్రా డెవలపర్స్ ఐపీఓకు సెబీ ఆమోదం
Thursday 18th July 2019ఇష్యూ సైజు రూ.200-225 కోట్లు న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నై ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. వాటర్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ ఈపీసీ సెగ్మెంట్లలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమిళనాడుకు చెందిన ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.200-225 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ. కోటి ఈక్విటీ షేర్లను జారీ