News


ఇండియా సిమెంట్స్‌ లాభం రూ.5 కోట్లు

Tuesday 12th November 2019
news_main1573531415.png-29524

  • గత క్యూ2లో రూ.5 లక్షల కోట్ల నష్టాలు 
  • 11 శాతం తగ్గిన ఆదాయం 


చెన్నై:- ఇండియా సిమెంట్స్‌ కంపెనీ ఈ  ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.5.07 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5.03 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఇండియా సిమెంట్స్‌ తెలిపింది. సిమెంట్‌ అమ్మకాలు తగ్గినా, వ్యయాలు తగ్గడం, రియలైజేషనన్లు మెరుగుపడటం వల్ల నిర్వహణ పనితీరు ఒకింత మెరుగుపడిందని కంపెనీ ఎమ్‌డీ ఎన్‌. శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. కార్యకలాపాల ఆదాయం రూ.1,430 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,269 కోట్లకు తగ్గిందని తెలిపారు. మొత్తం వ్యయాలు రూ.1,439 కోట్ల నుంచి రూ.1,271 కోట్లకు చేరాయని పేర్కొన్నారు.  గత క్యూ2లో 30.77 లక్షల టన్నులుగా ఉన్న సిమెంట్‌, క్లింకర్‌ అమ్మకాలు ఈ క్యూ2లో 26.67 లక్షల టన్నులకు తగ్గాయని తెలిపారు. 
మధ్య ప్రదేశ్‌లో కొత్త ప్లాంట్‌...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో సిమెంట్‌కు డిమాండ్‌ బాగా తగ్గిందని, ఫలితంగా దక్షిణ భారత్‌లోనే డిమాండ్‌ తగ్గిందని శ్రీనివాసన్‌ వివరించారు. మధ్య ప్రదేశ్‌లో కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నామని, భూ సమీకరణ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో సిమెంట్‌కు డిమాండ్‌ పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 



You may be interested

ఎన్‌ఎండీసీ లాభం 10 శాతం జంప్‌

Tuesday 12th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ సెప్టెంబరు త్రైమాసికంలో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.53 శాతం పెరిగి రూ.703 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.2,438 కోట్ల నుంచి రూ.2,242 కోట్లకు చేరింది. ముడి ఖనిజం విక్రయాలు 6.7 మిలియన్‌ టన్నుల నుంచి 5.82 టన్నులకు తగ్గాయి.

బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లాభం రూ.403 కోట్లు

Tuesday 12th November 2019

33 శాతం వృద్ధి  6 శాతం వృద్ధితో రూ.3,023 కోట్లకు నికర అమ్మకాలు  న్యూఢిల్లీ:- బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో రూ.403 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.303 కోట్లుతో పోల్చితే 33 శాతం వృద్ధి సాధించామని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,855 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.3,023

Most from this category