News


ఇండియా సిమెంట్స్‌ ఆదాయం రూ.1,391 కోట్లు

Saturday 10th November 2018
news_main1541829216.png-21853

న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్‌ కంపెనీ నికర లాభం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 94 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.24 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1 కోటికి తగ్గిందని ఇండియా సిమెంట్స్‌ తెలిపింది. అమ్మకాల పరిమాణం పెరిగినా, ధర తక్కువగా ఉండటం, ఇంధన వ్యయాలు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ, వైస్‌ చైర్మన్‌ ఎన్‌. శ్రీనివాసన్‌ వివరించారు. మొత్తం ఆదాయం రూ.1,275 కోట్ల నుంచి రూ.1,391 కోట్లకు పెరిగిందని  చెప్పారు. మొత్తం వ్యయాలు గత క్యూ2లో రూ.1,239 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.1,389 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు.  సిమెంట్‌ అమ్మకాలు 11 శాతం వృద్ధితో 30.10 లక్షల టన్నులకు పెరిగాయని తెలిపారు. ఎబిటా 15 శాతం తగ్గి రూ.155 కోట్లకు పరిమితమైందని శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. నిర్వహణ మార్జిన్‌ 3.1 శాతం తగ్గి 11.2 శాతానికి చేరిందని వివరించారు. మధ్యప్రదేశ్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడులతో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ పెట్టుబడులను అంతర్గతంగానే సమకూర్చూకుంటామని, అవసరమైతే బ్రిడ్జిలోన్‌ తీసుకుంటామని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండియా సిమెంట్స్‌ షేర్‌ 3.3 శాతం లాభంతో రూ.97 వద్ద ముగిసింది. You may be interested

భారీగా పెరిగిన హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లాభం

Saturday 10th November 2018

ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత క్యూ2లో రూ.68 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 325 శాతం వృద్ధితో రూ.289 కోట్లకు పెరిగిందని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ తెలిపింది. ఆదాయం రూ.2,373 కోట్ల నుంచి 10 శాతం పెరిగి రూ.2,610 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.125 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ

పుంజుకున్న ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: దేశీయంగా ప్రయాణికుల వాహన (ప్యాసింజర్‌ వెహికల్స్‌/కార్లు, జీపులు) విక్రయాలు అక్టోబర్‌ నెలలో ఫర్వాలేదనిపించాయి. వరుసగా మూడు నెలల క్షీణత తర్వాత అక్టోబర్‌లో అమ్మకాలు పుంజుకున్నాయి. 1.55 శాతం మేర వృద్ధి నమోదైనట్టు ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) తెలిపింది. సియామ్‌ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వెహికల్స్‌ విక్రయాలు 2,84,224 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే మాసంలో అమ్ముడైనవి 2,79,877 కావడం గమనార్హం. ఈ

Most from this category