News


ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా ఇండియా:ముఖేష్‌ అంబానీ

Monday 24th February 2020
news_main1582540564.png-32050

అతి త్వరలో ఇండియా ప్రీమియర్‌ డిజిటిల్‌ సొసైటీగా మారనుందని భారత కుబేరుడు, వ్యాపార దిగ్గజం ముఖేష్‌ అంబానీ అన్నారు. సోమవారం ముంబైలో జరుగుతున్ను ఫ్యూచర్‌ డీకోడెడ్‌ సీఈఓ సదస్సు(ఫిబ్రవరి 24-26)లో పాల్గొన్న  మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ సత్యనాదెళ్లతో ముచ్చటించిన సందర్భంగా అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా ప్రీమియర్‌ డిజిటల్‌ సోసైటీగా మారడమేగాక, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా  ఎదుగుతుందన్నారు. పేరుగాంచిన డిజిటల్‌​ సమాజంగా ఇండియా మారుతుందని, మొబైల్‌ నెట్‌వర్క్స్‌ పనితీరు అమోఘంగా పెరగడమే భారత పరివర్తనానికి ప్రధాన కారణమన్నారు. ఇంతకుముందుతో పోలిస్తే భారత్‌లో మొబైల్‌ నెట్‌వర్క్స్‌ వేగంగా వృద్ధి చెందాయన్నారు. ప్రధాని మోదీ 2014లో ఇచ్చిన డిజిటల్‌ ఇండియా పిలుపుతోనే భారత్‌ పరివర్తనం చెందడానికి ఒక కారణమని, అప్పుడే ఈ రంగం ఊపందుకుందని చెప్పారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తర్వాత 380 మిలియన్‌ వినియోగదారులు జియో 4జీ టెక్నాలజీకి మారారని గుర్తుచేశారు. మొబైల్‌ రంగంలోకి జియో అడుగు పెట్టకముందు దేశంలో సగటు డేటా స్పీడ్‌ 256 కేబీపీఎస్‌గా ఉండగా, జియో వచ్చాక 21 ఎంబీపీఎస్‌కు చేరిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనపై మాట్లాడుతూ..గత అధ్యక్షులు జిమ్మీ కార్టర్‌, బిల్‌ క్లింటన్‌,  ఒబామా వచ్చినప్పటికంటే ప్రస్తుతం భారత్‌లో చాలా మార్పులు వచ్చాయన్నారు.  వాటిలో ముఖ్యమైనది మొబైల్‌ కనెక్టివిటీ అని స్పష్టం చేశారు. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చూసుకుంటే తొలి మూడు స్థానాల్లో భారత్‌ నిలుస్తుంది. ఇందులో ఎలాంటి సందేహంలేదన్నారు. అయితే ఇది ఐదేళ్లలో అవుతుందా? పదేళ్లలో అవుతుందా? అనేదానిపైనే ఎక్కువ చర్చించాలన్నారు. ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా మారేందుకు భారత్‌కు గొప్ప అవకాశం ఉందని, కాగా అంబానీ సత్య నాదెళ్లను ఉద్దేశిస్తూ నేను, మీరు పెరిగిన రోజులతో పోలిస్తే భవిష్యత్తు భారతీయులు కచ్చితంగా కొత్త ఇండియాను చూస్తారని వివరించారు. 

        
  You may be interested

రిటైల్‌ ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తున్నారా..?

Tuesday 25th February 2020

బాగా పడిపోతున్న స్టాక్స్‌లో ఎంతో విలువ దాగి ఉందని రిటైల్‌ ఇన్వెస్టర్లు భావిస్తున్నట్టున్నారు. రేటింగ్‌ డౌన్‌ గ్రేడ్‌ అయినవి, కార్పొరేట్‌ సమస్యలతో కుదేలయినవి, రుణాల చెల్లింపుల్లో చేతులెత్తేస్తున్నవి, నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నవి.. ఇలా ఎన్నో కారణాలతో బాగా పడిపోతున్న స్టాక్స్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటాలు చాలా గరిష్ట స్థాయికి చేరడం చూస్తుంటే.. అవి మళ్లీ పూర్వ వైభవాన్ని ప్రదర్శిస్తాయని రిటైల్‌ ఇన్వెస్టర్లు అంచనా వేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.    బీఎస్‌ఈ 500 సూచీలోని రిటైల్‌

కరోనా ప్రభావంతో నిఫ్టీ కంపెనీల లాభాలు 3-5 శాతం తగ్గొచ్చు

Monday 24th February 2020

ఫార్మా రంగం ఆకర్షణీయం దివీస్‌, ఆర్తి లబ్ది పొందవచ్చు ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగం ఓకే - మోతీలాల్‌ ఓస్వాల్‌ పీఎంఎస్‌ కరోనా వైరస్‌ సంక్షోభాన్ని అప్పుడే పూర్తిగా అంచనా వేయలేమంటున్నారు మనీష్‌ సొంతాలియా, సీఈవో మోతీలాల్‌ ఓస్వాల్‌  పీఎంఎస్‌. మార్కెట్లు, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగం, కరోనా వైరస్‌ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ప్రపంచ మార్కెట్లపై కరోనా వైరస్‌ అత్యధిక ప్రభావాన్ని చూపే అవకాశముంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లు

Most from this category