News


ఫిబ్రవరిలో భారత్‌కు ట్రంప్‌!

Wednesday 29th January 2020
news_main1580272567.png-31286

భారీ ట్రేడ్‌ డీల్‌ కుదిరే అవకాశం
దాదాపు రూ.71వేల కోట్ల విలువైన మెగా ట్రేడ్‌ డీల్‌ భారత్‌, యూఎస్‌ మధ్య వచ్చే నెల కుదరనుంది. ఫిబ్రవరిలో యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్(యూఎస్‌టీఆర్‌) రాబర్ట్‌ లైట్జర్‌ భారత్‌కు రానున్నారు. భారత సందర్శనలో రాబర్ట్‌ ట్రేడ్‌డీల్‌ను ఖరారు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం ఫిబ్రవరిలోనే భారత్‌కు వచ్చే ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పర్యటనలో డీల్‌పై సంతకాలు జరుగుతాయని తెలిపాయి. ఫిబ్రవరి రెండో వారంలో రాబర్ట్‌, భారత పారిశ్రామిక మంత్రి పీయూష్‌గోయల్‌లు డీల్‌ విధివిధానాలు ఖరారు చేసే చర్చలు జరుపుతారని తెలిసింది. అధ్యక్షుడు ట్రంప్‌ వచ్చే నెల 24- 25 తేదీల్లో భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. డీల్‌ చర్చల కోసం ఇప్పటికే ఆరుగురితో కూడిన యూఎస్‌ టీమ్‌ ఒకటి గోయల్‌ను కలిసింది. గతేడాది గోయల్‌ అమెరికా పర్యటనలో రాబర్ట్‌తో డీల్‌పై చర్చించారు. ప్రస్తుతం ఫిబ్రవరిలో రాబర్ట్‌ వచ్చి డీల్‌ను ఖరారు చేసి తిరిగి అమెరికా వెళ్లి ట్రంప్‌తో కలిసి మరలా ఇండియాకు వస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
మెగా ఒప్పందం...


వచ్చేనెల భారత్‌, అమెరికా మధ్య కుదిరేది ఒక సరైన అతిపెద్ద ఒప్పందమని సంబంధిత అధికారులు చెప్పారు. రెండు దేశాల మధ్య ట్రేడ్‌ చర్చలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న మెడికల్‌ డివైజ్‌ల అంశం పరిష్కారమైందని తెలిపారు. తమ ఐటీ వస్తూత్పత్తులపై సుంకాలు ఎత్తివేయాలని, తమ డైరీ ఉత్పత్తులకు మార్కెట్‌ యాక్సెస్‌ కల్పించాలని, హార్లీ డేవిడ్‌సన్‌ బైక్స్‌పై సుంకాలు తగ్గించాలని అమెరికా ఎప్పటి నుంచో భారత్‌ను డిమాండ్‌ చేస్తోంది. అమెరికా తమకు తొలగించిన జీఎస్‌పీని తిరిగి పునరుద్ధరించాలని భారత్‌ కోరుతోంది. తాజా డీల్‌ ఒక ఫ్రీట్రేడ్‌ అగ్రిమెంట్‌ అని అధికారులు వెల్లడించారు. యూఎస్‌ డైరీ, మెడికల్‌ డివైజ్‌ పరిశ్రమల ఆరోపణల నేపథ్యంలో గతేడాది జూన్‌లో భారత్‌కు జీఎస్‌పీ హోదాను అమెరికా తొలగించింది. అంతకుముందేడాది ఈ హోదాతో ఎగుమతులపై భారత్‌ దాదాపు 24 కోట్ల డాలర్ల మినహాయింపులు పొందింది. అందుకే ఈ హోదా తిరిగి ఇవ్వాలని ఇండియా కోరుతోంది. యూఎస్‌ వ్యవసాయోత్పత్తులతో దేశీయ సాగు రంగంపై నెగిటివ్‌ ప్రభావం పడకుండా చూసుకోవాలని గతంలో గోయల్‌ అభిప్రాయపడ్డారు. అయితే ట్రేడ్‌డీల్‌లో దేన్నీ పూర్తిగా తిరస్కరించడం ఉండదని, సామరస్యపూర్వక పరిష్కారాల అన్వేషణ ఉంటుందని తెలిపారు. 2018లో భారత స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై యూఎస్‌ సుంకాలు పెంచినప్పటినుంచి సరైన డీల్‌ కోసం ఇరుపక్షాలు చర్చలు జరుపుతూనే ఉన్నాయి. 2019-20 ఏప్రిల్‌ నవంబర్‌ కాలంలో యూఎస్‌కు భారత్‌ ఎగుమతులు 3560 కోట్ల డాలర్లుండగా, దిగుమతులు 2510 కోట్ల డాలర్లకు చేరాయి. You may be interested

మహీంద్రా ఫైనాన్స్‌ లాభం రూ.475 కోట్లు

Wednesday 29th January 2020

16 శాతం వృద్ధి  14 శాతం పెరిగి రూ.3,081 కోట్లకు ఆదాయం న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.475 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆర్జించిన నికర లాభం, రూ.409 కోట్లుతో పోల్చితే 16 శాతం వృద్ధి సాధించామని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. ఆదాయం రూ.2,705 కోట్ల నుంచి 14

వచ్చే ఏడాది రూ.3,000 కోట్ల ఆదాయం

Wednesday 29th January 2020

జాన్సన్‌ లిఫ్ట్స్, ఎస్కలేటర్స్‌ వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: లిఫ్ట్స్‌, ఎస్కలేటర్స్‌ తయారీ సంస్థ జాన్సన్‌.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకుంది. 2018-19లో  రూ.2,000 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశామని కంట్రీ హెడ్‌ ఆల్‌బర్ట్‌ ధీరవియం తెలిపారు. నూతన మోడళ్లను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా  బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ గుప్తా, జీఎం చైతన్యతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి ఏటా

Most from this category