News


భారత్‌-అమెరికాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం!

Tuesday 25th February 2020
news_main1582626567.png-32083

అమెరికా, భారత్‌ దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య న్యూఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాలు  ఆర్థిక, వాణిజ్య, రక్షణ సంబంధించి మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అపాచీ ఎం16  హెలికాఫ్టర్ల ఒప్పందం, మానసిక ఆరోగ్యంపై మెడికల్‌ ఉత్పత్తుల సరఫరా ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అంతేగాక అయిల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ,ఎక్సాన్‌ మొబిల్‌ ఇండియా ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌,  చార్ట్‌ ఇండస్ట్రీస్‌ మధ్య ఒప్పంద సంతకాలు జరిగాయి. అనంతరం ఇద్దరు నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ..భారత పర్యటనకు వచ్చినందుకు మరోసారి డొనాల్డ్‌ ట్రంప్‌కి కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 8 నెలల్లో ఐదుసార్లు ట్రంప్‌తో సమావేశమయ్యానని ప్రధాని మోదీ అన్నారు. ట్రంప్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చించామన్నారు. ఇంధన సహకారం గురించి ప్రత్యేకంగా చర్చించామని, సమాన అవకాశాలతో కూడిన స్వేచ్ఛా వాణిజ్యం దిశగా చర్చలు జరిపామన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు వ్యతిరేకంగా తాము పోరాడతామన్నారు. భారత్‌, అమెరికా సంబంధాలకు ప్రభుత్వాలతో సంబంధం లేదని, వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. మన రక్షణ శాఖకు అత్యాధునిక ఆయుధాలు అందబోతున్నాయన్నారు. అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ..భారత్‌లో తమకు అద్భుతమైన స్వాగతం లభించిందని ట్రంప్‌ అన్నారు. మొతెరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తేట్రంప్‌’ కార్యక్రమాన్ని తాను గొప్ప గౌరవంగా భావిస్తునానన్నారు. మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని, రాజ్‌ఘాట్‌ను తాజ్‌ మహల్‌ను సందర్శించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తన పర్యటన ఫలప్రదమైదని, ఈ టూర్‌ ఎంతో ప్రత్యేకమన్నారు. అపాచీ,ఎం-16 హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందం జరిగిందని, 5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌పై చర్చించామని పరస్పర ప్రయోజనాలను కాపాడుకునేలా పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించామని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.


 
 You may be interested

వొలాటిలిటీ మధ్య నష్టాల ముగింపు

Tuesday 25th February 2020

సెన్సెక్స్‌ 82 పాయింట్లు డౌన్‌ 31 పాయింట్లు నీరసించిన నిఫ్టీ  ఫార్మా రంగం పతన బాట రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 82 పాయింట్లు క్షీణించి 40,281 వద్ద నిలవగా.. 31 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 11,798 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ ఆందోళనలు, ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు మధ్య మార్కెట్లు పలుమార్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. వెరసి సెన్సెక్స్‌ 40,536 పాయింట్ల వద్ద

నవీన్‌ ఫ్లోరిన్‌, శిల్పా మెడీ.. దూకుడు

Tuesday 25th February 2020

నవీన్‌ ఫ్లోరిన్‌ 20 శాతం హైజంప్‌ శిల్పా మెడికేర్‌ 5 శాతం‍ సర్క్యూట్‌ ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌, శిల్పా మెడికేర్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ నవీన్‌ ఫ్లోరిన్‌ కౌంటర్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఈ బాటలో ఫార్మా రంగ కంపెనీ శిల్పా మెడికేర్‌

Most from this category