News


ఆదాయపన్నులో కోత, శ్లాబ్‌ల్లో మార్పులు...?!

Thursday 26th December 2019
Markets_main1577338841.png-30449

పలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్న ఆర్థిక మంత్రి
నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌పై అంచనాలు
ఫిబ్రవరిలో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌

వచ్చే ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే పలు రంగాల నిపుణులు, కంపెనీల ప్రతినిధులు తదితరుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై పరిశీలన చేపట్టారు. ఈ బాటలో ప్రతి బడ్జెట్‌లోనూ మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపే ఆదాయపన్ను శ్లాబులపైనా చర్చ జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ వివరాలు చూద్దాం..

మినహాయింపులు లేని ఫ్లాట్‌ ట్యాక్స్‌ రేటు, అధిక ఆదాయంగల వారిపై ఆదాయపన్ను శ్లాబుల సవరణ, కార్పొరేట్‌ ట్యాక్స్‌ బాటలోనే వ్యక్తిగత పన్ను తగ్గించాలన్న డిమాండ్లు వంటి పలు ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధానంగా వినియోగాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. ఇందుకు వీలుగా అన్ని అవకాశాలనూ ఆర్ధిక శాఖ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగత ఆదాయపన్నులో మార్పులు 3 కోట్లమంది పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూర్చనున్నట్లు తెలియజేశారు. అలాగే పీఎం-కిసాన్‌ వంటి పథకాలకు ప్రాధాన్యం లభించే వీలున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆర్థిక ప్రగతికి కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని నిధులు సమకూర్చే ప్రణాళికలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు వివరించారు. 

కార్పొరేట్‌ ట్యాక్స్‌ బాటలో
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్‌ ట్యాక్స్‌లో కోతలను ప్రకటించిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వానికి రూ. 1.45 లక్షల కోట్లమేర ఆదాయానికి గండి పడనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయం కారణంగా కార్పొరేట్‌ రంగంలో పెట్టుబడులు ఊపందుకోనున్నట్లు భావిస్తున్నారు. ఈ బాటలో వ్యక్తిగత ఆదాయపన్నులోనూ మార్పులను ఆశిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ అంశంపై ఏర్పాటైన కమిటీ పలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 10 లక్షల ఆదాయం వరకూ 10 శాతం, రూ. 10-20 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను విధింపు ప్రతిపాదనలను సమీక్షిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు. రూ. 20 లక్షల నుంచి రూ. 2 కోట్లవరకూ వ్యక్తిగత ఆదాయంపై 30 శాతం, ఆపై 35 శాతం పన్ను విధింపును పరిశీలిస్తున్నట్లు వివరించారు. అధిక ఆదాయంగలవారిపై సర్‌చార్జీ తొలగింపుపైనా చర్చ జరగనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న మినహాయింపులలో మార్పులపై చర్చలు లేనట్లేనని చెప్పారు.

ప్రస్తుతం ఇలా
ప్రస్తుతం రూ. 2.5 లక్షల వరకూ ఆదాయం ఆర్జించేవారు ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరంలేదు. రూ. 2.5-5 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం, రూ. 5-10 లక్షల ఆదాయంపై 20 శాతం ఆదాయపన్ను చెల్లించవలసి ఉంటుంది. రూ. 10 లక్షలకుపైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను అమలవుతోంది. ఇక​రూ. 50 లక్షలకుపైబడిన ఆదాయంగల వారిపై అదనంగా 10-37 శాతం మధ్య సర్‌చార్జి అమలవుతోంది. తక్కువస్థాయి ఆదాయంగలవారికి కొన్ని మినహాయింపులు అమలవుతున్న విషయం విదితమే.



You may be interested

ట్రేడ్‌ డీల్‌ పై ఆశలతో మెటల్‌ షేర్లకు డిమాండ్‌

Thursday 26th December 2019

అమెరికా, చైనాల మధ్య ట్రేడ్‌ డీల్‌ ఒప్పందంపై ఆశలతో గురువారం మెటల్‌ షేర్లకు గిరాకీ నెలకొంది. ఫలితంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గురువారం ఉదయం సెషన్‌లో 1శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,725.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా, చైనాల మధ్య కుదిరిన మొదట దశ వాణిజ్య ఒప్పందంపై జనవరి మొదటివారంలో ఇరుదేశాధ్యక్షులు సంతకాలు పెడతారనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో

ఇన్ఫీబీమ్‌ హైజంప్‌- ఐఐఎఫ్‌ఎల్‌ కుదేల్‌

Thursday 26th December 2019

రెండు రోజుల పతనానికి ఇన్ఫీబీమ్‌ చెక్‌ 7వ రోజూ పతన బాటలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ గత కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతున్న ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 15 శాతం కుప్పకూలింది. రూ. 924 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి అమ్మకాలు ఉపశమించడంతో రికవరీ వచ్చింది. 9.45 ప్రాంతంలో 2.5 శాతం

Most from this category