News


డిఫాల్టర్ల ఆస్తుల వివరాలు బ్యాంకులకివ్వండి

Thursday 27th June 2019
news_main1561620486.png-26617

  • ఐటీ విభాగానికి సీబీడీటీ ఆదేశాలు

న్యూఢిల్లీ: రుణాల ఎగవేతదారుల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేసేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు కోరిన పక్షంలో.. ఎగవేతదారుల ఆస్తులు, ఖాతాల వివరాలను వాటికి అందించాలంటూ ఆదాయ పన్ను (ఐటీ) విభాగానికి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. అసెసీలు ఏటా సమర్పించే ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) నుంచి ఇందుకు సంబంధించిన వివరాలను క్రోడీకరించాలని సూచించింది. రుణాల రికవరీ కోసం డిఫాల్టర్ల స్థిరాస్తుల వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులు పలుమార్లు విజ్ఞప్తి చేసిన దరిమిలా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ పేర్కొంది. ఆస్తులతో పాటు బ్యాంకుల అభ్యర్ధన మేరకు లోన్ డిఫాల్టర్ల బ్యాంకు ఖాతాల వివరాలు, చిన్నా చితకా రుణదాతల వివరాలు కూడా ఇవ్వొచ్చని తెలిపింది. రుణ గ్రహీత, తనఖా ఉంచిన వారు, గ్యారంటార్లుగా ఉన్న వారి సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలని, అదే సమయంలో గోప్యనీయత నిబంధనలు కూడా కచ్చితంగా పాటించాలని సూచించింది. విజయ్ మాల్యా నుంచి నీరవ్ మోదీ దాకా పలువురు వ్యాపారవేత్తలు భారీ స్థాయిలో రుణాల మోసాలకు పాల్పడిన నేపథ్యంలో ఎగవేతదారుల విషయంలో నిబంధనలు ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. 



You may be interested

హైదరాబాద్‌ వద్ద వల్లభ డెయిరీ ప్లాంటు

Thursday 27th June 2019

రూ.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు జనవరికల్లా రాజమండ్రిలో కేంద్రం ఈ ఏడాది రూ.500 కోట్ల లక్ష్యం ‘సాక్షి’తో సంస్థ చైర్మన్‌ బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పాలు, పాల పదార్థాల రంగంలో ఉన్న వల్లభ డెయిరీ హైదరాబాద్‌ సమీపంలో అత్యాధునిక ప్లాంటును నెలకొల్పింది. యాదాద్రి- భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును బుధవారం ఆరంభించింది. రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్‌ చేయగల సామర్థ్యం ఈ

పెట్టుబడులు, టెండర్లు ఆపేయండి

Thursday 27th June 2019

బీఎస్‌ఎన్‌ఎల్‌కు టెలికం శాఖ ఆదేశం కంపెనీ ఆర్థిక సమస్యలే కారణం న్యూఢిల్లీ: ముందస్తు కొనుగోళ్ల ఆర్డర్లు, ఇప్పటికే ఖరారైన టెండర్లను తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా నిలిపివేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ను టెలికం శాఖ (డాట్‌) ఆదేశించింది. దీంతో పెట్టుబడి వ్యయాలకు సంబంధించి కొత్త టెండర్లు ప్రకటించాలంటే ముందుగా ఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీసర్ అనుమతులు తీసుకోవాలంటూ అన్ని సర్కిల్స్‌ హెడ్స్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థిక విభాగం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బీఎస్‌ఎన్‌ఎల్ తీవ్ర

Most from this category