News


ఐటీ శాఖ నుంచి ఆదాయ పన్ను కాలిక్యులేటర్‌

Friday 7th February 2020
news_main1581043729.png-31576

న్యూఢిల్లీ: మినహాయింపులుండని కొత్త ట్యాక్స్ విధానంలోకి మారదల్చుకునేవారు ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తూ ఇన్‌కం ట్యాక్స్ శాఖ ప్రత్యేకంగా ఈ-కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో పాత, కొత్త విధానాలను పోల్చి చూసుకుని, ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు. రిటర్నులను దాఖలు చేసేందుకు ఉద్దేశించిన https://www.incometaxindiaefiling.gov.in లో ఈ కాలిక్యులేటర్‌ అందుబాటులో ఉంటుంది. తమ ఆదాయాలు, మినహాయింపులు, డిడక్షన్స్‌ మొదలైన వివరాలన్నీ ఇందులో పొందుపరిస్తే.. పాత, కొత్త విధానాల్లో పన్ను భారాలను తెలుసుకోవచ్చు. కొన్ని మినహాయింపులను వదులుకున్న పక్షంలో తక్కువ పన్ను భారం వర్తించేలా 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేంద్రం కొత్త శ్లాబులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత విధానంలో ఆదాయాన్ని బట్టి 5, 10, 30 శాతాల్లో పన్నులు ఉంటున్నాయి. రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌, పొదుపు పథకాల్లో రూ. 1.5 లక్ష దాకా పెట్టుబడులకు మినహాయింపులు లభిస్తున్నాయి. 



You may be interested

నిర్మా గ్రూప్‌ చేతికి ఇమామి సిమెంట్‌

Friday 7th February 2020

డీల్‌ విలువ రూ.5,500 కోట్లు  కోల్‌కత: ఇమామి గ్రూప్‌నకు చెందిన ఇమామి సిమెంట్‌ను నిర్మా గ్రూప్‌ కొనుగోలు చేస్తోంది. నిర్మా గ్రూప్‌నకు చెందిన న్యూవొకొ విస్టాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (గతంలో నిర్మా సిమెంట్‌) రూ.5,500 కోట్లకు ఇమామి సిమెంట్‌ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇమామి గ్రూప్‌ తెలిపింది. గ్రూప్‌ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఇమామి సిమెంట్‌లో వంద శాతం వాటా విక్రయించాలని ఇమామి

మారని రేట్లు.. వృద్ధికి చర్యలు

Friday 7th February 2020

మారని రేట్లు.. వృద్ధికి చర్యలు రియల్టీ, ఆటో, బ్యాంకింగ్‌ రంగాలకు ప్రోత్సాహకాలు రెపో, రివర్స్‌ రెపో రేట్లలో యథాతథ స్థితికి మొగ్గు కొనసాగిన ద్రవ్యోల్బణ ఆందోళనలు సర్దుబాటు విధానం కొనసాగింపు అవసరమైతే రేట్ల కోత ఉంటుందన్న సంకేతాలు (అప్‌డేటెడ్‌...) ముంబై: వడ్డీరేట్లను ప్రభావితం చేసే కీలకమైన రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లను ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్‌, రియల్టీ, ఎంఎస్‌ఎంఈ,

Most from this category