STOCKS

News


ద్రవ్యలోటును అదుపులో ఉంచాలి!

Thursday 17th October 2019
news_main1571284609.png-28938

  • ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌

వాషింగ్టన్‌: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్‌ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ సూచించారు. అయితే దేశ ఆదాయ అంచనాలు కొంత సానుకూలంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. 2018లో భారత్‌ వృద్ధి రేటు 6.8 శాతం అయితే, 2019లో 6.1 శాతంగానే ఉంటుందని, 2020లో 7 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్‌ మంగళవారం వెలువరించిన తన అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో గోపీనాథ్‌ విలేకరులతో మాట్లాడారు.  నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ విభాగం, వినియోగ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణాల వంటి అంశాల్లో ఒడిదుడుకులు, సవాళ్లను భారత్‌ ఎదుర్కొంటోందని  పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంక్‌ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఆమె అన్నారు. బ్యాంకింగ్‌ మొండిబకాయిల సమస్య పరిష్కారం ఇందులో కీలకమైనదని వ్యాఖ్యానించారు. 

ద్రవ్యలోటుపై భయాలు..!
ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు ఆగస్టు ముగిసే నాటికే 5,53,840 కోట్లకు చేరింది. 2019-2020 మొత్తంలో బడ్జెట్‌ నిర్దేశించుకున్న పరిమాణంలో  ఇది 78 శాతానికి సమానం. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద (మార్చి వరకూ) ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లకు ‍కట్టడి చేయాలని 2019-20 బడ్జెట్‌ నిర్దేశించుకుంది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతం.  అయితే ఐదు నెలలు గడిచే సరికే ద్రవ్యలోటు 78 శాతానికి చేరడం ఆందోళనకరమైన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా కేంద్రం కార్పొరేట్‌ పన్నును కూడా భారీగా తగ్గించిన నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాలను చేరడంపై ఆందోళనలు ఉన్నాయి. అయితే ద్రవ్యలోటు లెక్కలను తరువాత చూసుకుంటామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. 

మహిళా కార్మికులకు అభద్రతాభావం...
కాగా, భారత్‌లో కార్మిక శక్తికి సంబంధించి మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో మహిళలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ‘‘ఒక మహిళ పనికి కానీ లేదా పాఠశాలకుగానీ వెళ్లకపోవడానికి కారణాల్లో ఒకటి వారిలో ఉన్న అభద్రతాభావం’’ అని పేర్కొన్నారు. 

1990 నుంచి భారత్‌లో సగం తగ్గిన పేదరికం: ప్రపంచబ్యాంక్‌
కాగా, 1990 నుంచీ భారత్‌లో పేదరికం సగానికి సగం తగ్గిందని ప్రపంచబ్యాంక్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. అలాగే గడచిన 15 సంవత్సరాల్లో 7 శాతం వృద్ధిని సాధించిందని పేర్కొంది. మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి పలు విభాగాల్లో పటిష్ట పురోగతి సాధించినట్లు తెలిపింది. You may be interested

హావెల్స్‌ స్మార్ట్‌ స్విచ్‌ గేర్స్‌

Thursday 17th October 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ హావెల్స్‌ ఇండియా స్టడెక్స్‌ పేరుతో స్మార్ట్‌ స్విచ్‌ గేర్స్‌ను ప్రవేశపెట్టింది. మినియేచర్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ (ఎంసీబీ), డిస్ట్రిబ్యూషన్‌ బోర్డ్‌ సాంకేతికంగా అత్యాధునికమైనవని హావెల్స్‌ ప్రెసిడెంట్‌ సౌరభ్‌ గోయల్‌ తెలిపారు. ఏపీ, తెలంగాణ బిజినెస్‌ హెడ్‌ మహేందర్‌ వల్లకాటితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వీటితో నిర్వహణ సమస్యలు ఉండవు. గృహ, కార్యాలయాల్లో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా రూపొందించాం. స్టడెక్స్‌లో

డిజిటల్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ సెకండ్‌

Thursday 17th October 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ లావాదేవీల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని, రాష్ట్రాల వారీగా జాబితా చూస్తే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని రేజర్‌పే సీటీఓ అండ్‌ కో–ఫౌండర్‌ శశాంక్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, పాల్వంచ నుంచి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ రేజర్‌ పే మూడవ ఎడిషన్‌ నివేదికను

Most from this category