News


శ్రీసిటీలో ఐఎంఓపీ ప్లాంట్‌ విస్తరణ

Tuesday 15th October 2019
news_main1571114058.png-28888

కేవీబీపురం : శ్రీసిటీలోని జపాన్‌కు చెందిన ఇండియా మెటల్‌ వన్‌ స్టీల్‌ ప్లేట్‌ ప్రోసెసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐఎంఓపీ) పరిశ్రమ ఉత్పత్తి కేంద్రం విస్తరణ సోమవారం జరిగింది. ఐఎంఓపీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తకేషి హిరాయ్‌ నూతన ఉత్పత్తి కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 2012లో శ్రీసిటీలో ఏర్పాటైన ఐఎంఓపీ పరిశ్రమ కస్టమర్లకు వినూత్న పరిష్కారాలను అందిస్తోందని తకేషి హిరాయ్‌ అన్నారు. ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నూతనంగా ఫ్లాంటును విస్తరింపజేశామన్నారు. రూ.200కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ఐఎంఓపీ మరో రూ.80కోట్ల పెట్టుబడులతో అదనంగా మరో ప్లాంటు విస్తరణ జరిగిందన్నారు. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి, సామర్థ్యం 24వేల టన్నులని, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందన్నారు. ఈ పరిశ్రమలో గతంలో 500 మందికి ఉద్యోగవకాశాలు లభించగా ప్రస్తుతం విస్తరణ చేసిన అదనపు ప్లాంటు ద్వారా మరో 100 మందికి అదనంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అనంతరం శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఆటోరంగం మందగమనాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఐఎంఓపీ పరిశ్రమ విస్తరణ దశగా శ్రీసిటీలో మరింత పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమన్నారు.You may be interested

విరాళాల్లో హెచ్‌సీఎల్‌ నాడార్ టాప్‌..

Tuesday 15th October 2019

ముకేశ్ అంబానీ మూడో స్థానంలో  ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా జాబితాలో వెల్లడి ముంబై: సామాజిక సేవా కార్యక్రమాల కోసం అత్యధికంగా విరాళమిచ్చిన దేశీ దిగ్గజాల్లో టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్‌ అధిపతి శివ్‌ నాడార్ అగ్రస్థానంలో నిల్చారు. మరో టెక్‌ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ రెండో స్థానంలో ఉండగా.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం మూడో స్థానంలో నిల్చారు. ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా ఫిలాంత్రోపీ

9 రోజుల్లో రూ.81,700 కోట్ల రుణాలు

Tuesday 15th October 2019

రుణ మేళాలో బ్యాంకుల జోరు... డిపాజిట్లకు బీమా పెంపు పరిశీలన కేంద్ర ఆర్థిక శాఖా ప్రకటన న్యూఢిల్లీ: పండుగుల సీజన్‌లో మార్కెట్లో రుణ వితరణ పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... అక్టోబర్‌ 1 నుంచి 9 వరకు తొమ్మిది రోజుల్లో బ్యాంకులు నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో రూ.81,781 కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ సోమవారం

Most from this category