News


ఇంటి నుంచే పని

Saturday 21st March 2020
news_main1584765902.png-32611

కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచన
కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగం
ప్రభుత్వరంగ సంస్థల్లో సగం మంది ఇంటి నుంచే పని

కరోనా వైరస్‌ నియంత్రణ పోరులో భాగంగా కంపెనీలు, ఎల్‌ఎల్‌పీ కింద నమోదైన సంస్థలు తమ ఉద్యోగులను వారి ఇళ్ల నుంచే పనిచేయించుకునే విధంగా తక్షణ కార్యాచరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తాత్కాలిక చర్యల్లో భాగంగా మార్చి 31 వరకు దీన్ని అమలు చేయాలని కోరింది. కోవిడ్‌-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధను తెలియజేసే సీఏఆర్‌ పత్రాన్ని కంపెనీలు విధిగా ఫైల్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది. సామాజిక దూరంను ప్రోత్సహించడం ద్వారా కరోనా విస్తరణను అడ్డుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇక కార్పొరేట్‌ కంపెనీలు బోర్డు సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌, ఆడియో, విజువల్‌ విధానంలో జూన్‌ 30 వరకు నిర్వహించుకునేందుకు కార్పొరేట్‌ శాఖ అనుమతించింది.
సగం మంది ఇంటి నుంచే
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు అన్నీ కూడా నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగుల్లో సగం మందిని తప్పకుండా ఇంటి నుంచే పనిచేయించుకోవాలని ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాలు, ప్లాంట్లు, యూనిట్లలో రద్దీని నివారించాలని సూచనలు చేసింది. ఈ ఆదేశాలను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, ఏప్రిల్‌ 4 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగుల్లో సగం మందిని ఒక వారం పనిచేయించుకుంటే, మరో సగం మందిని తర్వాతి వారంలో పని చేయించుకోవాలని సూచించింది. 
 



You may be interested

కోవిడ్‌-19 రక్షణకు స్టార్‌ హెల్త్‌ నుంచి పాలసీ

Saturday 21st March 2020

 కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) పాజిటివ్‌గా తేలి, హాస్పిటల్‌ పాలైన వారికి కవరేజీని అందించే పాలసీని స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ సంస్థ తీసుకొచ్చింది. ‘స్టార్‌ నోవెల్‌ కరోనా వైరస్‌’ అనే పేరుతో వచ్చిన ఈ పాలసీలో 18-65 సంవత్సరాల వయసు వారు పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, ఈ పాలసీ కింద ఏక మొత్తంలో పరిహారాన్ని కంపెనీ అందిస్తుంది. విదేశీ పర్యటన చరిత్ర ఉండకూడదన్న షరతులు ఈ పాలసీలో లేకపోవడం సానుకూలం.

కర్ఫ్యూలో 7 కోట్లకుపైగా..

Saturday 21st March 2020

ఆదివారం జరిగే జనతా కర్ఫ్యూలో తమ సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) తెలిపింది. 7 కోట్లకుపైగా వ్యాపార సంస్థలు మూతపడనున్నాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. ఈ సంస్థల్లో పనిచేస్తున్న 40 కోట్ల మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అవుతారని చెప్పారు.

Most from this category