ట్రేడ్ వార్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పే
By Sakshi

అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీనా లగార్డే ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధానికి తర్వలోనే తెరపడకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు డౌన్‌సైడ్ ముప్పు తప్పదని ఆమె హెచ్చరించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం, ఈ ఏడాది ప్రథమార్థం నుంచి అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ అంశాలు అంతర్జాతీయ వృద్ధి రేటుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయన్నారు. అయితే, ఈ ఏడాది ద్వితీయార్ధం, వచ్చే ఏడాది కల్లా వృద్ధి రేటు పుంజుకునే అవకాశం ఉండవచ్చనే ఆశాభావాన్ని లగార్డే వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్ గత నెలలో 2019లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 3.7 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. ఇక ఈ వారంలో చైనా టెలికాం దిగ్గజ కంపెనీ హువాయిపై అమెరికా భారీ ఎత్తున సుంకాలను విధించడంతో చైనా మండిపడింది. అమెరికాతో జరుగుతున్న చర్చలపై చైనా మీడియా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో అమెరికాకు చెందిన కొన్ని కంపెనీలను బ్లాక్‌లిస్ట్ చేర్చుతామని చైనా హెచ్చరించింది.
You may be interested
బజాజ్ ఫిన్ సర్వీసెస్ షేర్లపై బ్రోకరేజ్ సంస్థలు బుల్లిష్
Saturday 18th May 2019ముంబై: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ మెరుగైన ఫలితాలను సాధించిన నేపథ్యంలో పలు బ్రోకరేజ్ సంస్థలు బజాజ్ ఫైనాన్స్ షేర్లకు టార్గెట్ ధరను పెంచాయి. మార్చి త్రైమాసిక కాలంలో అన్ని అంశాల్లో మంచి రాణించడంతో కంపెనీ లాభం 32శాతం పెరిగి రూ.839 కోట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదాయం సైతం 44శాతం పెరిగి రూ.12,995 కోట్లకు చేరింది. కొత్త వినియోగదారులు పెరగడం, స్థిరంగా రుణ వృద్ధిని సాధించడం,
రెండువారాల కనిష్టానికి పసిడి ధర
Saturday 18th May 2019ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం రెండు వారాల కనిష్టానికి పతనమైంది. డాలర్ ఇండెక్స్ ర్యాలీ, అమెరికా కన్జూ్యమర్ గణాంకాలు 15 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం పసిడి క్షీణతకు కారణమయ్యాయి. రాత్రి అమెరికాలో ఔన్స్ పసిడి ధర 10.50 డాలర్ల నష్టపోయి 1,275.70 డాలర్ల వద్ద స్ధిరపడింది. ఇటీవల కాలంలో అమెరికా విడుదల చేస్తున్న పటిష్టమైన ఆర్థిక గణాంకాలు ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లు సంకేతాలను ఇస్తున్నాయి. ఈ తరుణంలో