News


ఐఎండీ ర్యాంకింగ్‌లో 6 మెట్లు తగ్గిన భారత్‌

Tuesday 19th November 2019
news_main1574133381.png-29684

  • 59వ స్థానంతోనే సరి

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌ ‘ఐఎండీ’ తాజాగా ప్రకటించిన వరల్డ్‌ టాలెంట్‌ ర్యాంకింగ్‌లో భారత్‌ వెనకపడింది. మొత్తం 63 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్‌ 6 మెట్లు తగ్గి 59వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడి, అభివృద్ధి, సంసిద్ధత ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను విడుదలచేయగా.. చైనా (42), రష్యా (47), దక్షిణ ఆఫ్రికా (50)వ స్థానాల్లో నిలిచి, బ్రిక్స్‌ దేశాల జాబితాలో భారత్‌ను వెనక్కునెట్టాయి. విద్యపై వ్యయం (ప్రతి విద్యార్థికి) తక్కువగా ఉండడం వంటి అంశాలు ర్యాంకును గణనీయంగా తగ్గించాయని ఐఎండీ బిజినెస్ స్కూల్ స్విట్జర్లాండ్, సింగపూర్‌ సీనియర్ ఎకనామిస్ట్ జోస్ కాబల్లెరో వ్యాఖ్యానించారు. జీడీపీతో పాటు శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యం, ఆరోగ్య వ్యవస్థ ప్రభావం కూడా భారత ర్యాంక్‌ తగ్గడానికి కారణాలుగా నిలిచాయని వివరించారు. ఇక ఈ జాబితాలో స్విట్జర్లాండ్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. డెన్మార్క్(2), స్వీడన్(3), ఆస్ట్రియా (4), లక్సెంబర్గ్ (5) ర్యాంకుల్లో నిలిచాయి. 



You may be interested

సత్యం కేసులో సెబీకి ‘సుప్రీం’ ఊరట

Tuesday 19th November 2019

- సత్యం కేసులో సెబీకి ‘సుప్రీం’ ఊరట న్యూఢిల్లీ: ఆడిటర్లను నిషేధించే అధికారం మార్కెట్స్‌ నియంత్రణ సంస్థ సెబీకి లేదంటూ సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.  సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ కేసు విషయంలో  సెప్టెంబర్‌ 9న శాట్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెబీ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తాజా

మార్చి నాటికి బీపీసీఎల్‌, ఎయిరిండియా విక్రయం

Tuesday 19th November 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు రిఫైనరీ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్‌), విమానయాన సంస్థ ఎయిరిండియాల విక్రయం సాధ్యమైనంత వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ముగించాలని కేంద్రం యోచిస్తోంది. మార్చి నాటికల్లా అమ్మకం పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎయిరిండియాపై చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె వివరించారు. ఎయిరిండియా విక్రయానికి

Most from this category