News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్ పరిరక్షణకు చర్యలు..

Friday 5th October 2018
news_main1538714183.png-20882

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ విలువను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బోర్డు పేర్కొంది. వ్యవస్థాగతంగా కీలకమైన సంస్థను గట్టెక్కించే ప్రణాళిక రూపకల్పన కోసం తరచూ భేటీ కానున్నట్లు తెలిపింది. గురువారం తొలిసారిగా భేటీ అయిన కొత్త బోర్డు దాదాపు అయిదు గంటల పాటు కంపెనీ వ్యవహారాలపై చర్చించింది. గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇతర వాటాదారులతో కూడా తగు సమయంలో భేటీ కానున్నట్లు సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ ఉదయ్ కొటక్.. విలేకరులకు తెలిపారు. గ్రూప్ ఆడిట్ కమిటీ చైర్మన్‌గా బోర్డు సభ్యుడు, ప్రముఖ ఆడిటర్ నందకిశోర్‌ ఎంపికయ్యారని చెప్పారు. దాదాపు రూ. 91,000 కోట్ల రుణ భారమున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతుండటం.. మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం రంగంలోకి దిగి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు కొత్త బోర్డును నియమించింది. ఉదయ్ కొటక్ సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డులో సెబీ మాజీ చైర్మన్ జీఎన్ బాజ్‌పాయ్‌, ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ జీసీ చతుర్వేది, ఐఏఎస్‌ అధికారి మాలిని శంకర్‌, టెక్ మహీంద్రా వైస్‌ చైర్మన్ వినీత్ నయ్యర్ తదితరులు ఉన్నారు. 
మారుతీ చైర్మన్ పదవి నుంచి తప్పుకునేది లేదు: భార్గవ
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం నేపథ్యంలో తాను మారుతీ సుజుకీ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న వార్తలను ఆర్‌సీ భార్గవ ఖండించారు. చట్టప్రకారం తాను తప్పు చేసినట్లు రుజువైతే తప్ప తప్పుకోనక్కర్లేదని గతంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డైరెక్టరుగా వ్యవహరించిన భార్గవ తెలిపారు. వడ్డీలు చెల్లించేందుకు తగినన్ని నిధులు లేవన్న అంశం మేనేజ్‌మెంట్‌కు మూడు నాలుగేళ్లుగా తెలుసన్నారు. బోర్డు సమావేశాల్లో పలు మార్లు ఇది చర్చకు వచ్చేదని, తగు పరిష్కార మార్గాలపై ప్రణాళికల రూపకల్పన కూడా జరిగేదని చెప్పారాయన. యాజమాన్య నిర్వహణ లోపాలు, నిర్లక్ష్య ధోరణుల ఆరోపణలతో 10 మంది మాజీ డైరెక్టర్లపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వేసిన పిటీషన్‌లో భార్గవ పేరు కూడా ఉంది. ఈ పది మందిని ఇతర కంపెనీల బోర్డుల్లో కొనసాగనివ్వబోరంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.You may be interested

ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌

Friday 5th October 2018

న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌లో 26 శాతం వాటా కొనుగోలు ‍కోసం ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా రూ.10 ముఖ విలువ గలఒక్కో ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ను రూ.61.73 ధరకు 26 శాతం వాటాకు సమానమైన 204 కోట్లకు పైగా షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్‌ఐసీ పేర్కొంది. ఈ మొత్తం ఓపెన్‌ ఆఫర్‌ రూ.12,602 కోట్లని పేర్కొంది.  కాగా ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఎల్‌ఐసీకి షేర్లు

ఆర్సెలర్‌ మిట్టల్‌, న్యుమెటల్‌కు మరో అవకాశం

Friday 5th October 2018

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు బిడ్‌ వేసుకునేందుకు ఆర్సెలర్‌ మిట్టల్‌, రష్యాకు చెందిన వీటీబీ బ్యాంకు ఆధ్వర్యంలోని న్యుమెటల్‌కు సుప్రీంకోర్టు మరో అవకాశం కల్పించింది. రూ.45,000 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైన ఎస్సార్‌ స్టీల్‌ పునరుద్ధరణ ప్రణాళికను దాఖలు చేసేందుకు మాత్రం అనుమతి లేదని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘రెండు వారాల్లోగా మీ కంపెనీల తాలూకు ఎన్‌పీఏలను చెల్లించేయండి. అలా

Most from this category