News


ఐఎల్‌ అండ్ ఎఫ్‌ఎస్... తనే పరిష్కరించుకుంటుంది

Tuesday 25th September 2018
news_main1537850963.png-20541

న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీలు చెల్లించలేక డిఫాల్ట్ అయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) తన సమస్యలను తానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వ్యాఖ్యానించారు. "ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. దానికంటూ స్వతంత్ర బోర్డు, షేర్‌హోల్డర్లు ఉన్నారు. కాబట్టి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తన సమస్యలను తానే స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఆ సమర్ధత ఉందనే నేను భావిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. ఆస్తులు, అప్పుల మధ్య తాత్కాలిక వ్యత్యాసం ఏర్పడవచ్చని.. కానీ అంతిమంగా ఆ సంస్థే ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని గర్గ్ చెప్పారు. ఇందులో ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయమేమీ లేదని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో కేంద్రానికి నేరుగా వాటాలేమీ లేకపోయినప్పటికీ.. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు వాటాలు ఉన్నాయి. ఎల్‌ఐసీకి నాలుగో వంతు వాటా ఉండగా, జపాన్‌కి చెందిన ఓరిక్స్ కార్పొరేషన్‌కు 23.5 శాతం, ఎస్‌బీఐకి 6.42 శాతం, హెచ్‌డీఎఫ్‌సీకీ 9 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 7.67 శాతం మేర వాటాలు ఉన్నాయి. సిడ్బి నుంచి తీసుకున్న రూ. 1,000 కోట్ల స్వల్పకాలిక రుణాలను చెల్లించలేక ఐఎల్‌ అ౾ండ్‌ ఎఫ్‌ఎస్ డిఫాల్ట్ అయిందన్న సంగతి సెప్టెంబర్ 4న బైటపడిన సంగతి తెలిసిందే. 



You may be interested

నిలకడగా పసిడి ధర

Tuesday 25th September 2018

డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా మంగళవారం పసిడి ధర నిలకడగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాలం ఉదయం 10 గంటలకు ఔన్స్‌ పసిడి 1 డాలరు స్వల్పంగా నష్టపోయి 1,203.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు, రేపు (సెప్టెంబర్‌ 25, 26 తేదిల్లో) ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా-చైనా దేశాల

ఆడిట్‌ రిపోర్ట్‌తో ఐటీఆర్‌ ఫైలింగ్‌కు గడువు పెంపు!

Tuesday 25th September 2018

న్యూఢిల్లీ:  ఆడిట్‌ రిపోర్ట్‌తో ఆదాయపు పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌నకు గడువును కేంద్రం మరో పక్షం రోజులు పొడిగించింది. ప్రస్తుతం ఈ గడువు సెప్టెంబర్‌ 30. ఈ గడువును అక్టోబర్‌ 15 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలియజేసింది.  సంబంధిత వర్గాల నుంచి అందిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం తాజా నిర్ణయం తీసుకున్నట్లు బోర్డ్‌ పేర్కొంది. 

Most from this category